CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: వైఫ్ ఆఫ్ రామ్
నటీనటులు: మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, ఆదర్శ్ బాలకృష్ణణ్..
సంగీతం: రఘు దీక్షిత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అజయ్ యేలకంటి
నిర్మాత: మంచు లక్ష్మి, వివేక్ కూచిబొట్ల
మంచు కుటుంబం నుంచి నటిగా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది లక్ష్మి. ఇప్పుడు ఈమె వైఫ్ ఆఫ్ రామ్ సినిమాతో వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న హీరోల భార్యలతో ప్రమోట్ చేయించింది ఈ చిత్రాన్ని.. మరి ఇది ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుంది..? ఇంతకీ వైఫ్ ఆఫ్ రామ్ ఎలా ఉంది..?
కథ:
లక్ష్మి(మంచు లక్ష్మి) తన భర్త రామ్ (సామ్రాట్ రెడ్డి)తో కలిసి ఓ రోజు బయటికి వెళ్తుంది. అప్పుడు అక్కడ అనుకోకుండా రామ్ ను ఎవరో చంపేస్తారు. ఆ సమయంలో ప్రగ్నెంట్ గా ఉన్న లక్ష్మికి అబార్షన్ అవుతుంది. ఆ తర్వాత తన బిడ్డ, భర్తను చంపింది ఎవరో తెలుసుకోడానికి పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ అక్కడ వాళ్లు స్పందించరు. దాంతో సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. తన భర్తను చంపేసింది రాకీ (ఆదర్శ్ బాలకృష్ణణ్) అని తెలుసుకుంటుంది. ఆ క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ చారి(ప్రియదర్శి) రామ్ భార్యకు సాయం చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లకు ఆ మర్డర్ చేసిన వాడు దొరికాడా లేదా అనేది కథ..
కథనం:
బాలీవుడ్ లో కహానీ సినిమా చాలా మంది చూసుంటారు. అందులో కథైనా కనీసం క్లారిటి ఉంటుంది. తన భర్త కోసం ఓ భార్య చేసే ఒంటరి పోరాటమే ఈ సినిమా కథ. ఇప్పుడు మంచు లక్ష్మి నటించిన వైఫ్ ఆఫ్ రామ్ కూడా సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి కథే. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నోసార్లు చూసిన టిపికల్ మర్డర్ మిస్టరీ కథ ఇది. ఈ క్రైమ్ కథలను ఎన్నిసార్లు తీసినా కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పుడు కొత్త దర్శకుడు అజయ్ యెలకంటి కూడా ఇదే చేసాడు. మంచులక్ష్మి కాకుండా ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉండుంటే కథ గురించి చెప్పడానికి.. సినిమా గురించి మాట్లాడటానికి ఇంకా చాలా విషయాలు ఉండేవి. ఆమెను ఈ కథలో ఊహించడం కష్టమే. కథ బాగుంది.. దర్శకుడి కష్టం కసి ఈ చిత్రంలో కనిపించాయి. తొలి సీన్ నుంచే ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు. కొత్త దర్శకుడు కావడంతో స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్టాఫ్ అంతా సోసోగా అనిపించినా.. సెకండాఫ్ లో కథ బాగానే పరుగులు పెడుతుంది. అయితే ప్రతీసారి మంచు లక్ష్మి కాకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ ఒక్క పాయింట్ ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ తో పాటు సందేశాన్ని కూడా ఇచ్చి సినిమాను పూర్తి చేసాడు దర్శకుడు.
నటీనటులు:
మంచులక్ష్మి కెరీర్ లో తొలిసారి సిన్సియర్ కథను అటెంప్ట్ చేసింది. నటిగా తనను తాను నిరూపించుకోడానికి ఈమె చేస్తోన్న ప్రయత్నానికి సలాం చేయాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ గా ప్రియదర్శి మంచి పాత్రలో నటించాడు. రౌడీ ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగర్ బాగానే చేసాడు. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణన్ ఉన్నంత వరకు ఓకే. మిగిలిన వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.
టెక్నికల్ టీం:
పాటలు లేని ఈ చిత్రానికి రఘు దీక్షిత్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే పని చేసింది. కొన్ని సీన్స్ లో మంచి స్కోర్ ఇచ్చాడు ఈయన. తక్కువ నిడివి ఉంది కాబట్టి ఎడిటింగ్ లో కూడా పెద్దగా సమస్యలేం లేవు. అయితే ఫస్టాఫ్ లో మాత్రం అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కథ విషయానికి వస్తే దర్శకుడు విజయ్ తో పాటు సందీప్ గంటాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. సమాజంలో జరుగుతున్న కాన్ టెంపరరీ ఇష్యూను తీసుకుని కథ సిద్ధం చేసుకున్నారు. దర్శకుడి విషయానికి వస్తే తొలి సినిమా సమయంలో చేసే కొన్ని లోపాలు కనిపించాయి. అందులో క్యాస్టింగ్ కూడా ఒకటి.
చివరగా:
వైఫ్ ఆఫ్ రామ్.. ఓ భార్య కథ..!