శ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ నెం.1 ప్రారంభం

శ్రీ ర‌త్నం దవేజీ స‌మ‌ర్ప‌ణ‌లోశ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై అవ్వారు వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా జె.వి.నాయుడు నిర్మిస్తోన్న సినిమా ప్రారంభ‌మైంది. రికార్డింగ్ కార్య‌క్ర‌మాల‌తో విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత జె.వి.నాయుడు మాట్లాడుతూ – “ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేస్తోన్న హార‌ర్, ల‌వ్‌, కామెడీ, సెంటిమెంట్ సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే.ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న ల‌వ్ కామెడీ హార‌ర్ అంశాల‌తో పాటు మ‌న‌సుకు హ‌త్తుకునే పాయింట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌. మ‌ధుమిత‌తో పాటు యుక్త ప్రియ హీయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. అలాగే కృష్ణ‌భ‌గ‌వాన్‌, కాదంబ‌రికిర‌ణ్‌, రాకెట్ రాఘ‌వ‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, భావ‌న‌, సురేఖావాణి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రంంలో ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు న‌టించ‌నున్నారు. వీరీతో పాటు సాంకేతిక వ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః ర‌త్నం ద‌వేజీ, స‌హ నిర్మాత‌లుః అవ్వారు వంశీకృష్ణ‌, కొల‌న్‌ నంద‌న్‌రెడ్డి, నిర్మాతః జె.వి.నాయుడు, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వంః వెంక‌ట్‌.