సమంత – చైతన్య ల పెళ్ళి కి ఖరీదైన హోటల్

నాగ చైతన్య – సమంత ల పెళ్ళి అంగరంగ వైభోగంగా జరగనుందని సమాచారం. అక్టోబర్ 6 న గోవా లో జరగనున్న ఈ పెళ్ళికి 200 మంది అతిధులు కాబోతున్నారట. వారి కోసం గోవా లో అత్యంత ఖరీదైన ‘W’ హోటల్ లో రూములు బుక్ చేసారు అక్కినేని వారు. ఈ హోటల్ లో ఒక్కో రూము సుమారు 16 వేలు రూపాయిలుంటాది. ఇక సూట్ రూమ్ అయితే ఏకంగా 75 వేలు ఉంటాడట. ఇప్పటికే ప్రేమ జంట గోవా లో వాలిపోయి పెళ్ళి పనులు దగ్గరుండి చూసుకొంటున్నారట. మరో వైపు నాగార్జున తో సమంత నటించిన ‘రాజు గారి గది 2 ‘ విడుదల కాబోతుంది. చైతు ఈ చిత్రాన్ని చూడబోనని చెప్పినట్లు నాగార్జున నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పడం విశేషం. ఈ హారర్-కామెడీ చిత్రంలో సమంత దెయ్యం గా కనిపించబోతుంది కాబట్టి చై చూడనని చెప్పాడట.