సాయిధ‌రం.. అనుక్ష‌ణం భ‌యంభ‌యం..

అవును.. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ కెరీర్ ఇలాగే న‌డుస్తుంది. దానికి కార‌ణం ఒక‌టి రెండు కాదు ఏకంగా ఐదు ఫ్లాపులు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లే వెళ్తుంటే ఈ సారి వ‌చ్చే సినిమా క‌చ్చితంగా నిల‌బ‌డేదిలా ఉండాలి కానీ ప‌డుకునేదిలా కాద‌ని మొక్కి మ‌రీ చేస్తున్నాడు ఈ సారి క‌రుణాక‌ర‌ణ్ తో తేజ్ ఐ ల‌వ్ యూ సినిమాను సాయిధ‌రంతేజ్..! ఈ మెగా మేన‌ల్లుడు ఆశ‌ల‌న్నీ ప్ర‌స్తుతం ఈ చిత్రంపైనే ఉన్నాయి.

చాలా ఏళ్ళ త‌ర్వాత సీనియ‌ర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. పాట‌లు చూస్తుంటే మ‌రోసారి కరుణాక‌ర‌ణ్ ప‌క్కా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ చేసాడ‌ని అర్థ‌మైపోయింది. జూన్ 29న విడుద‌ల కానుంది తేజ్ ఐ ల‌వ్ యు. పాట‌లు కూడా గోపీసుంద‌ర్ బాగా ఫీల్ తో ఇచ్చాడు. చిరు చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియో విడుద‌లైంది.

ఇందులో హీరోయిన్ మెమోరి లాస్ పేషెంట్ గా క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది. ఎదుటే ఉన్న ప్రేమికున్ని గుర్తించ‌లేని పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌నిపిస్తుంది. అచ్చంగా ఇలాంటి పాత్రే ఉల్లాసంగా ఉత్సాహంగాలో హీరోయిన్ పాత్ర‌కు డిజైన్ చేసాడు క‌రుణాక‌ర‌ణ్. అయితే అక్క‌డ అది నాట‌కం..

కానీ ఇప్పుడు ఇక్క‌డ మాత్రం నిజం. అంతా బాగానే ఉంది కానీ సాయి కోరుకుంటున్న విజ‌యం ఈ చిత్రంతో అయినా వ‌స్తుందా రాదా అనేది ఇప్పుడు ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఎందుకంటే ఓ వైపు సాయి ఫ్లాపుల్లోనే ఉన్నాడు.. మ‌రోవైపు నిర్మాత కేఎస్ రామారావుకు హిట్లు లేవు.. అనుప‌మ జాత‌కం కూడా బాగాలేదు.. ఇక క‌రుణాక‌ర‌ణ్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా అంతా ఫ్లాప్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. చిన్న‌పుడు చ‌దువుకున్న‌ట్లు మైన‌స్ మైన‌స్ ప్ల‌స్ అవుతుందేమో చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here