సిగ్గు సిగ్గు.. ఈ వారం అన్నీ ఫ్లాపులే..!

ఒక‌టి రెండు కాదు.. ఈ వారం నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో ఒక్క‌టి కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఆట‌గ‌ద‌రా శివ సినిమాకు టాక్ బాగున్నా అది థియేట‌ర్స్ కు ర‌ప్పించేంత పెద్ద సినిమా అయితే కాదు. దిల్ రాజు బ్యాన‌ర్ లో వ‌చ్చిన ల‌వ‌ర్ అయితే రాజ్ త‌రుణ్ కు మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచింది.
ఈ చిత్రం క‌నీస ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేక రాజుగారి ఇమేజ్ తీసేసింది. దాంతో రాబోయే సినిమాల‌పై మ‌రింత దృష్టి పెట్ట‌డానికి రెడీ అయ్యాడు దిల్ రాజు. ఈ వార‌మే విడుద‌లైన మ‌రో సినిమా వైఫ్ ఆఫ్ రామ్. మంచు ల‌క్ష్మి హీరోయిన్ గా వ‌చ్చిన ఈ చిత్రానికి టాక్ బానే వ‌చ్చింది కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం వైఫ్ ఆఫ్ రామ్ సేఫ్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు.
ల‌క్ష్మి కాకుండా మ‌రో హీరోయిన్ ఉండుంటే సినిమా మ‌రోలా ఉండేద‌నే టాక్ కూడా బ‌య‌ట న‌డుస్తుంది. ఇక ప‌రిచయం అనే మ‌రో సినిమా కూడా ఈ వార‌మే వ‌చ్చింది. అయితే ఇది వ‌చ్చినట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. దాంతో గ‌త‌వారం విడుద‌లైన ఆర్ఎక్స్ 100కే ఈ వారం కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌ట్టారు. ఈ చిత్రం 10 కోట్ల మార్క్ అందుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here