స్పైడర్ మెగా హీరో చిత్రమైయుంటే?

మహేష్ బాబు స్పైడర్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏ ఆర్ మురుగదోస్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రం బాక్స్ ఆఫీస్ బోల్తాపడటమే సూపర్ స్టార్ కు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ ‘భరత్ అనే నేను’ షూటింగ్ ను పక్కన పెట్టి కుటుంబం తో ఇటలీ విహార యాత్రకు వెళ్ళిపోయాడట. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కు పోస్టుపోన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అసలు స్పైడర్ ఎక్కడ తేడాకొట్టింది అని ఒక సారి విశ్లేషిస్తే.

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు గా, హీరోయిజమ్ సరిగ్గా ఎలివేట్ చేయకపోవడం, విల్లన్ కోసమే చిత్రాన్ని తీసారా అన్నట్లుగా ఎస్ జె సూర్యహ్ క్యారెక్టర్ చుట్టూ నే కథ తిరగడం వంటి ఎన్నో అంశాలు స్పైడర్ యొక్క ఈ స్థితి కి కారణం. సరిగ్గా గమనిస్తే మూల కథ రామ్ చరణ్ ధృవకు దగ్గరగానే ఉంటుంది. అక్కడ హీరో విల్లన్ కి మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది.

అక్కడ విల్లన్ అరవింద్ స్వామి కూడా చిన్నతనం నుండి చిత్రమైన స్వభావం కలిగి ఉంటాడు. స్పై డర్ లో విల్లన్ సైకో అయితే ధ్రువ లో విల్లన్ బయో టెర్రర్ సృష్టిస్తాడు. ఆఖరికి మహేష్ బాబు ఎస్ జె సూర్య ను ఇంటరాగేషన్ చేసే సీన్ కూడా ధ్రువ లో క్లైమాక్స్ లో వచ్చే సీన్ పోలి ఉంటుంది. అయితే ధ్రువ పక్క గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే వాళ్ళ బాగుందనిపిస్తే, పట్టు లేని డల్ స్క్రీన్ప్లే తో స్పైడర్ చతికిలబడింది.