స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20171207

Critic Reviews for The Boxtrolls

న‌టీన‌టులు: స‌ప్త‌గిరి, కాశిష్ వోహ్రా, సాయికుమార్, ఎల్బీ శ్రీ‌రామ్, గొల్ల‌పూడి త‌దితరులుమూల‌కథ‌: సుభాష్ క‌పూర్
మాట‌లు: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్
క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌

ఎంతోమంది క‌మెడియ‌న్లు హీరోలుగా మారారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ స‌క్సెస్ అయిన వాళ్లు లేరు. సునీల్ లాంటి హీరోల‌కు కూడా క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఇన్ని క‌ష్టాలుంటాయని తెలిసినా కూడా స‌ప్త‌గిరి హీరో అయ్యాడు.. ఇప్ప‌టికే ఓ సినిమా చేసాడు.. ఇప్పుడు మ‌రో సినిమాతో వ‌చ్చాడు. మ‌రి ఈయ‌న ప‌రిస్థితేంటి..?

క‌థ‌:

స‌ప్త‌గిరి(స‌ప్త‌గిరి) చిత్తూరులోని పుంగనూరు నుంచి వ‌చ్చిన ఓ ఎల్ఎల్ బి. జిల్లా కోర్టులో ఎక్స్ పీరియన్స్ రాద‌ని.. హైద‌రాబాద్ వ‌చ్చి ఇక్క‌డ ప్రాక్టీస్ చేస్తుంటాడు. కేసులు లేని స‌ప్త‌గిరికి ఓ రోజు స‌డ‌న్ గా ఓ పెద్ద కేస్ వ‌స్తుంది. ఆ కేస్ ను వాదించే లాయ‌ర్ రాజ్ పాల్(సాయికుమార్). ఆల్రెడీ క్లోజ్ అయిన ఓ హిట్ అండ్ ర‌న్ కేస్ ను తిరిగి పిల్ వేసి ప్రారంభిస్తాడు స‌ప్త‌గిరి. ఆ కేస్ లో చ‌నిపోయింది బిచ్చ‌గాళ్ల‌ని కోర్ట్ ఇచ్చిన తీర్పు త‌ప్ప‌ని వాదిస్తాడు.. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది.. హిట్ అండ్ ర‌న్ కేసులో చ‌నిపోయిన వాళ్లెవ‌రు.. వాళ్ల త‌ర‌ఫున స‌ప్త‌గిరి చేసిన పోరాట‌మేంటి అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం:

క‌మెడియ‌న్లు హీరోలు కావ‌డం కామ‌న్.. రాజ‌బాబు కాలం నుంచే వ‌స్తున్న ఆన‌వాయితీ ఇది. ఇప్పుడు స‌ప్త‌గిరి కూడా ఇదే ట్రై చేస్తున్నాడు. స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి అంటూ న్యాయ పోరాటం చేసాడు. స్ట్రాంగ్ కంటెంట్ తోనే హీరోగా ప్ర‌య‌త్నించాడు స‌ప్త‌గిరి. రైతుల కోసం ఓ లాయ‌ర్ చేసే న్యాయ పోరాట‌మే స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి. ఫ‌స్టాఫ్ లో లేని కామెడీ కోసం ట్రై చేసి.. వెకిలి వేషాల‌తో.. సీరియ‌స్ గా వెళ్తోన్న‌ క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాడు స‌ప్త‌గిరి. సెకండాఫ్ లో మాత్రం ఆ త‌ప్పు చేయ‌లేదు.. చాలావ‌ర‌కు కామెడీపై ఫోక‌స్ త‌గ్గించి.. అస‌లు క‌థ‌పై చాలా సీరియ‌స్ గా దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌. ఒక్క‌సారి మెయిన్ ఇష్యూ మొద‌లైన త‌ర్వాత ఎక్క‌డా సైడ్ ట్రాక్ ఎక్క‌లేదు.. క్లైమాక్స్ 20 నిమిషాలు సినిమాకు ప్రాణం.. కోర్ట్ సీన్ అంతా చాలా బాగుంది. జాలి ఎల్ఎల్ బి ఆధారంగా చేసిన సినిమా స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి. మూల‌క‌థ‌ను మాత్ర‌మే తీసుకున్న ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్.. ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లు క‌థ‌ను మార్చేసాడ‌ని సినిమా చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. క‌మెడియ‌న్లు హీరోగా మారితే అంతా సీరియ‌స్ గానే ఉండాల‌నే రూలేం ఉండ‌దిక్క‌డ‌.

సినిమా మొద‌లైన తొలి అర‌గంట బాగా బోర్ కొట్టిస్తాడు ద‌ర్శ‌కుడు. కావాల‌ని ఇరికించిన సీన్లు.. మ‌ధ్య‌లో విసిగించే పాట‌లతో ఏంటో ఈ లొల్లి అనిపిస్తుంది. కానీ సాయికుమార్ ఎంట్రీ త‌ర్వాత సీన్ అంతా మారిపోతుంది. ఏదో సీరియస్ ఇష్యూ సినిమాలో ఉంద‌నిపిస్తుంది. మెల్ల‌గా సాగుతున్న కొద్దీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఒక్కో చిక్కు విడిపోతూ వ‌స్తుంది. ఇంట‌ర్వెల్ టైమ్ కు స‌ప్త‌గిరి, సాయి కుమార్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప్రొఫెష‌న‌ల్ వార్ కు తెర‌లేస్తుంది. సెకండాఫ్ లో క‌థ ప‌ట్టాలెక్కిన త‌ర్వాత కామెడీ జోలికి వెళ్లలేదు ద‌ర్శ‌కుడు. బిచ్చ‌గాళ్లు కాదు చ‌నిపోయింది రైతులు అని తెలిసిన‌పుడు తెలిసిన సీన్ చాలా బాగా పండింది.. ఆ త‌ర్వాత క్లైమాక్స్ వ‌ర‌కు ఎక్క‌డా ఆగ‌లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వ‌చ్చే డైలాగులు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఓవ‌రాల్ గా స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి రైతుల కోసం తీసిన సినిమా.. బానే అనిపిస్తుంది.

న‌టీన‌టులు:
స‌ప్త‌గిరి కొన్ని సీన్లు బాగా చేసాడు.. కానీ సీరియ‌స్ సీన్స్ లో కామెడీ చేసి అన‌వ‌స‌రంగా బుక్క‌య్యాడేమో అనిపించింది. ఇక హీరో త‌ర్వాత సాయికుమార్ పాత్ర చాలా కీల‌కం. ఈ పాత్ర సినిమాను న‌డిపించింది. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావ్ క‌నిపించింది ఒకే సీన్ అయినా బాగుంది. గొల్ల‌పూడి.. ఎల్బీ శ్రీ‌రామ్ ఉన్నంత వ‌ర‌కు చాలా బాగా న‌టించారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:

స‌ప్త‌గిరి ఎల్ఎల్బికి సంగీతం పెద్ద‌గా క‌లిసిరాలేదు. బుల్గానిన్ అందించిన సంగీతం ఆక‌ట్టుకోలేదు. పాట‌లు నాయిస్ గా అనిపించాయి. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. విదేశాల్లో చేసిన పాట‌లు పెద్ద‌గా కిక్ అనిపించ‌లేదు. ఎడిటింగ్ ప‌ర్లేదు.. ఫ‌స్టాఫ్ లో చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక క‌థ హిందీ నుంచి తెచ్చుకున్నదే అయినా.. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు బాగానే మార్చాడు ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రాణం. హిట్ అండ్ రన్.. రైతుల స‌మ‌స్య‌లు.. ఫుట్ పాత్ ల‌పై పోయే ప్రాణాల గురించి చాలా మంచి డైలాగులు రాసారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.

చివ‌ర‌గా: స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బి.. స‌ప్త‌గిరి కామెడీ కాదు బాసూ.. సీరియ‌స్సే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here