స‌మంత షిఫ్టింగులు చేస్తుందిగా..!

పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌డుతుందంటారు. కానీ స‌మంత‌కు మాత్రం పెళ్లి త‌ర్వాతే సుడి ఇంకా క‌లిసొస్తుంది. అస‌లు ఈమె పెళ్ళైన త‌ర్వాత ఎన్ని సినిమాలు చేసింది.. ఎన్ని విజ‌యాలు సాధించింది అని లెక్కేస్తే.. 100 శాతం స‌క్సెస్ రేట్ తో దూసుకెళ్లిపోతుంది. తెలుగులో రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టితో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది ఈ స‌మ్మ‌ర్ లో స‌మంత‌. ఇక త‌మిళ్ లో ఈమె విశాల్ తో న‌టించిన ఇరుంబుతిరై బ్లాక్ బ‌స్ట‌రే. ఇది తెలుగులో అభిమ‌న్యుడుగా వ‌చ్చి ఇక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో సూప‌ర్ డీల‌క్స్ షూటింగ్ పూర్తి చేసింది స్యామ్. దాంతోపాటు తెలుగులో యు ట‌ర్న్ సినిమా కూడా పూర్తి చేసింది. రెండు సినిమాల్లో త‌న వంతు షూటింగ్ ను పూర్తి చేసి.. శివ‌కార్తికేయన్ సినిమా మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంచింది.

ఇక తెలుగులో భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిటైంది. ఇలా హైద‌రాబాద్ టూ చెన్నై చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది స‌మంత‌. అటు ఇటు షిఫ్టింగులు చేస్తున్నా కూడా ఇప్ప‌టికీ చాలా మంది ద‌ర్శ‌కులు.. హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ గా మారిపోయింది స‌మంత‌. దాంతో పెళ్లైనా కూడా నువ్వే కావాలంటూ అంతా వెంట ప‌డుతున్నారు. మ‌రి ఈ మాయ‌లేడి హ‌వా ఇంకెన్నాళ్లుంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here