స‌మ్మోహ‌నం` షూటింగ్ పూర్తి


కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది. ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది. అలాంటి అపురూప‌మైన‌, అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తో కొత్త త‌రం ప్రేమ క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం `స‌మ్మోహ‌నం`. షూటింగ్ పూర్త‌యింది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం `స‌మ్మోహ‌నం`. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ “మా `స‌మ్మోహ‌నం` షూటింగ్ ని సుముహూర్తంలో ప్రారంభించాం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా , శ‌ర‌వేగంగా, అంతే నాణ్య‌త‌గా చిత్రీక‌ర‌ణ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్టాం. త్వరలో టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పాట‌లు శ్రోత‌ల‌ను మెప్పిస్తాయి. అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కించిన చిత్రం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “మంచి క‌థ‌, క‌థ‌నానికి చ‌క్క‌టి నిద‌ర్శ‌నం ఈ చిత్రం. రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మైన `స‌మ్మోహ‌నం` షూటింగ్ పూర్తి చేసుకుంది. చిల్డ్ర‌న్స్ బుక్స్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా హీరో క‌నిపిస్తారు. అనూహ్య‌మైన క‌థాంశంతో, ఆద్యంతం వినోదాత్మ‌కంగా న‌డిచే క‌థ‌తో చిత్రాన్ని తెర‌కెక్కించాం. నిర్మాణ విలువ‌లు మెప్పిస్తాయి. వివేక్ సాగ‌ర్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ చిత్రానికి హైలైట్ అవుతుంది. జూన్‌లో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డే వేళ మా సినిమా కూడా ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను రంజింప‌జేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది“ అని చెప్పారు.
న‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here