హీరో శ్రీకాంత్ చిత్రం ‘రా.రా…’ ఆడియో విడుదల

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో

ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియో ఇటీవల అనంతపురం లో జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో జరిగింది. ఈ వేడుకలో హీరో శ్రీకాంత్ తో పాటు యువ కథానాయకులు తరుణ్, నిఖిల్, నరేష్, నవీన్ చంద్ర, తారకరత్న,ప్రిన్స్ లతో పాటు సంపూర్ణేష్ బాబు, అర్చన, ముమైత్ ఖాన్, గీతాసింగ్ తదితరులు పాల్గొని చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Hero Srikanth Ra...Raa Audio Released
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’ ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న ‘రా..రా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, త్వరలోనే చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్,
సమర్పణ: శ్రీమిత్ర చౌదరి
నిర్మాత: విజయ్
దర్శకత్వం: విజి చరిష్ యూనిట్