హృతిక్ ను బాగానే ఉతికేసిందిగా..

బాలీవుడ్ బంధాల గురించి ఏం చెప్పాలి..? అక్క‌డ ఎప్పుడు ఎవ‌రితో ఉంటారో ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. ఆ మ‌ధ్య హృతిక్ రోష‌న్ త‌న భార్య సుజానే కాద‌ని మ‌రీ కంగ‌న ర‌నౌత్ తో కొన్నాళ్లు ప్రేమ‌లో ఉన్నాడు. ఈ ఇద్ద‌రి ల‌వ్ గురించి దేశ‌మంతా మాట్లాడుకుంది. ఒకానొక టైమ్ లో పెళ్లి కూడా చేసుకుంటారేమో అనిపించింది.
అయితే అనుకోకుండా ఇద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత హృతిక్ రోష‌న్ పై చాలా సీరియ‌స్ అయింది కంగ‌న ర‌నౌత్. హృతిక్ కూడా కంగ‌న‌ను బాగానే టార్గెట్ చేసాడు. ఇప్పుడు అంతా అయిపోయింది.. కూల్ గా ఎవ‌రి సినిమాలు వాళ్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో మ‌ళ్లీ హృతిక్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది కంగ‌న‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న జీవితంలో జ‌రిగిన గుర్తు చేసుకోలేని సంఘ‌ట‌న‌ల గురించి మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ‌.
అందులో హృతిక్ టాపిక్ కూడా ఉంది. పేరు తీయ‌కుండా.. బెండు తీసింది కంగ‌న‌. తాను కావాలని కోరిన ప్రతిదీ త‌న‌కు చెడు చేసేదే అని.. ఇంటి నుంచి పాయిపోయి వ‌చ్చిన త‌ర్వాత చాలా సార్లు త‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాన‌ని చెప్పింది కంగ‌న‌. అయితే ఆ పెళ్లి జరగకపోవడం ఇప్పుడు సంతోషంగా ఉందని చెబుతుంది ఈ భామ‌.
ప్రేమ విఫలమైన కొన్నేళ్లకు త‌న‌ను రక్షించావంటూ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాన‌ని చెప్పింది కంగ‌న‌. ఆ ప్రేమికుడు హృతిక్ రోష‌నే అని అంద‌రికీ తెలిసిందే. త‌న‌ జీవితంలో జ‌రిగింది ప్ర‌తీ ఒక్క‌రికి తెలుసు అని.. అది ప్ర‌త్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పేసింది కంగ‌న‌. కెరీర్ లో కానీ జీవితంలో కానీ త‌న‌ను ప‌నికిరావు అన్నోళ్లే ఆ త‌ర్వాత త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి నువ్వు సూప‌ర్ అన్నార‌ని.. అది చాలు ఈ జీవితానికి అంటుంది కంగ‌న రనౌత్. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మాజీ ప్రియున్ని టార్గెట్ చేసింది కంగ‌న‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here