హ‌ను ఇప్పుడైనా అల‌రిస్తాడా..?


కొంద‌రు ద‌ర్శ‌కులు సినిమాల‌ను అద్భుతంగా తెర‌కెక్కిస్తుంటారు. వాళ్ళ టాలెంట్ చూసి అంతా ఫిదా అవుతుంటారు. కానీ విజ‌యం మాత్రం వాళ్లను ప‌ల‌క‌రించదు. ప్ర‌శంస‌లు త‌ప్ప‌. ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయ‌న సినిమాల‌న్నింటికీ అద్భుతం అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంటుంది.
కానీ క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం అంతా నిరాశ‌నే మిగులుస్తాయి. నాని కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ప‌ర్లేద‌నిపించింది కానీ మిగిలిన అందాల రాక్ష‌సి, లై సినిమాలు మాత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు శ‌ర్వానంద్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో హీరోయిన్. ఇప్ప‌టికే కోల్ క‌త్తాలో తొలి షెడ్యూల్ పూర్త‌యింది. ఇప్పుడు హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయింది టీం. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. మార్చ్ 6న శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు కానుక‌గా ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ టైటిల్ కూడా విడుద‌ల చేస్తున్నారు. దీనికి ప‌డిప‌డి లేచే మ‌న‌సు అనే అచ్చ‌మైన తెలుగు టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఈ సినిమాతో క‌చ్చితంగా త‌న కెరీర్ కూడా పైకి లేస్తుంద‌ని భావిస్తున్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. జులైలో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. సాయిప‌ల్ల‌వి, శ‌ర్వానంద్ కెరీర్ గ్రాఫ్ ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here