హ‌లో రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20171222

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: హ‌లో
న‌టీన‌టులు: అఖిల్, క‌ళ్యాణి, అజ‌య్, ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు..
నిర్మాత‌: అక్కినేని నాగార్జున‌
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్ర‌ఫీ: పిఎస్ వినోద్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విక్ర‌మ్ కే కుమార్

ఏ హీరోకైనా తొలి సినిమా డిజాస్ట‌ర్ అయితే ఆ బాధ మామూలుగా ఉండ‌దు. తీపి జ్ఞాప‌కంగా మిగ‌లాల్సిన సినిమా కాస్తా చేదు జ్ఞాప‌కంగా మారితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. అఖిల్ ఈ బాధ‌ను రెండేళ్లు మోసాడు. ఇప్పుడు హ‌లో సినిమాతో వ‌చ్చాడు. మ‌రి ఇప్పుడైనా ఆ బాధ తీరిందా..?

క‌థ‌:
శీను(అఖిల్) అనాథ‌. అత‌డి లైఫ్ లోకి చిన్న‌పుడే జున్ను జున్ను (క‌ళ్యాణి) వ‌స్తుంది. శీను ఎవ‌రో తెలుసుకోకుండానే అత‌డికి బాగా ద‌గ్గ‌ర‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం బాగా పెరిగిపోతుంది. ఒక‌రి కోసం మ‌రొక‌రు అనిపించేలా ద‌గ్గ‌రైన వాళ్లు.. అనుకోకుండా విడిపోతారు. ఓ రోజు స‌డ‌న్ గా జున్ను ఫ్యామిలీ ఢిల్లీకి వెళ్లిపోతారు. శీనుకు జున్ను ఇచ్చిన 100 రూపాయ‌ల నోట్ పై ఫోన్ నెంబ‌ర్ రాసి ఇస్తుంది. కానీ దాన్ని పోగొట్టుకుంటాడు శీను. అలా చిన్న‌పుడే విడిపోతారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఫోన్ పోగొట్టుకుని జున్నుకు దూర‌మ‌వుతాడు. ఈ జ‌ర్నీలో ఏమైంది.. ఎప్పుడు జున్నును శీను క‌లిసాడు అనేది క‌థ‌.

క‌థ‌నం: 
ప్రేమ‌క‌థ‌లు అంటే కేరాఫ్ అక్కినేని ఫ్యామిలీ. వీళ్ల‌కు ప్రేమ‌క‌థ‌లు ఎప్పుడూ క‌లిసొస్తూనే ఉంటాయి. అఖిల్ కూడా తొలి సినిమా కోసం మాస్ ట్రై చేసి డిజాస్ట‌ర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు విక్ర‌మ్ సాయంతో మ‌రోసారి లాంఛ్ అయ్యాడు అఖిల్. హ‌లోతో విక్ర‌మ్ ను పూర్తిగా న‌మ్మేసాడు. హ‌లో కోసం విక్ర‌మ్ కే కుమార్ మ్యాజిక్ చేసాడు. అఖిల్ తొలి సినిమా చేదు జ్ఞాప‌కాల‌న్నీ మ‌రిచి పోయేలా మ్యాజిక్ చేసాడు. మ‌న‌సంతా నువ్వేను గుర్తుకు తెప్పించే క‌థే అయినా ఎక్క‌డా మ‌న‌కు ఆ ధ్యాసే రాకుండా త‌న స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు విక్ర‌మ్ కే కుమార్. అత‌డి అంద‌మైన నెరేష‌న్ తో క‌థ ప‌రుగులు పెట్టింది. చిన్న‌పుడు జున్ను, శీను మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. ర‌మ్య‌కృష్ణ‌, అఖిల్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ ను చాలా అందంగా రాసుకున్నాడు విక్ర‌మ్. వాటిని అంతే అందంగా తెర‌పై చూపించాడు కూడా.
క‌థ‌ను ఇబ్బంది పెట్ట‌కుండా వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్.. కెమెరా వ‌ర్క్ చాలా బాగున్నాయి. ఫ‌స్టాఫ్ లోనే క‌థ‌ను చ‌క్క‌గా మొద‌లుపెట్టాడు విక్ర‌మ్ కే కుమార్. తాను తీసుకున్న‌ది పెద్ద క‌థ కాద‌ని త‌న‌కు ముందే తెలుసు. అందుకే ఎక్కువ‌గా స్క్రీన్ ప్లేపైనే ఫోక‌స్ చేసాడు. ఒక్క‌రోజులో జ‌రిగే క‌థ అయినా.. ముందుకు వెన‌క్కి జ‌రుపుకుంటూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసాడు. తెర‌పై ఇది చాలాసార్లు వ‌ర్క‌వుట్ అయింది కూడా. సెకండాఫ్ మొత్తాన్ని ఎమోష‌న‌ల్ గా న‌డిపించే ప్ర‌య‌త్నం చేసాడు విక్ర‌మ్. హీరో హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే బాండింగ్ కూడా చాలా బాగా కుదిరింది. క్లైమాక్స్ మ‌న‌సును హ‌త్తుకుంటుంది. కానీ ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవ‌రాల్ గా హ‌లో మ‌న‌సును త‌ట్టి లేపే ప్రేమ‌క‌థే.

న‌టీన‌టులు: 
అఖిల్ తో పోల్చుకుంటే హ‌లోలో అఖిల్ న‌టుడిగా చాలా మెరుగ‌య్యాడు. తొలి సినిమాలో ఈయ‌న్ని అస‌లు వాడుకోలేద‌ని ఈ చిత్రం చూస్తే అర్థ‌మైపోతుంది. ముఖ్యంగా లుక్స్.. డాన్స్.. ఇలా అన్నీ తొలి సినిమా కంటే బెట‌ర్ అయ్యాయి. క‌థ‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు సిసింద్రీ. కాక‌పోతే ఎక్స్ ప్రెషన్స్ ఇంకా ప‌ల‌కాలేమో.. అది పోనుపోను మెరుగ‌వ్వొచ్చు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తొలి సినిమానే అయినా బాగా న‌టించింది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మాయ చేసింది. ర‌మ్య‌కృష్ణ అమ్మ‌గా జీవించింది. జ‌గ‌ప‌తిబాబు కూడా ఓకే. అజ‌య్ విల‌న్ గా కాసేపు క‌నిపిస్తాడంతే. అతడిది కీల‌క‌మైన పాత్రేమీ కాదు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రాణం. చాలా చోట్ల అత‌డి నేప‌థ్య సంగీతం సినిమాను నిల‌బెట్టింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వ‌చ్చే సీన్స్ లో అనూప్ ప్రాణం పెట్టాడు. మ‌నం త‌ర్వాత అత‌డి బెస్ట్ ఔట్ పుట్ ఇదే. ఎడిటింగ్ లో ప్ర‌వీణ్ పూడి మాయ చేసాడు. విక్ర‌మ్ అన్ని సినిమాల‌కు అత‌డే బ్యాక్ బోన్. సెకండాఫ్ లో ఎడిట్ వ‌ర్క్ బాగా ప‌నిచేసింది. ఇక సినిమాటోగ్ర‌ఫీ మాయ చేసాడు పిఎస్ వినోద్. ప్ర‌తీ పాట ఓ అద్భుతంగా అనిపించింది. టెక్నిక‌ల్ గా హ‌లో చాలా సౌండింగ్ మూవీ. ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు నాగార్జున‌. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. సింపుల్ క‌థ‌ను చాలా అందంగా నెరేట్ చేసాడు విక్ర‌మ్. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా క‌థ‌ను ప‌రుగులు పెట్టించాడు. ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉన్న‌ట్లు అనిపించినా.. సెకండాఫ్ మాత్రం చాలా బాగా న‌డిచింది. ఓవ‌రాల్ గా మ‌రోసారి మాయ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు..

చివ‌ర‌గా: 
హ‌లో.. మ‌న‌సంతా జున్నే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here