ఛ‌లో రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, ర‌ష్మిక మంద‌న్న‌, పోసాని, న‌రేష్, ర‌ఘుబాబు త‌దిత‌రులు
నిర్మాణం: ఉషా మ‌ల్పూడి
సంగీతం: మ‌హ‌త్ సాగ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీ‌రామ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: వెంకీ కుడుముల‌
ఛ‌లో.. ఈ మ‌ధ్య కాలంలో బాగా వినిపించిన పేరు ఇది. దానికి కార‌ణం అందులోని కామెడీ.. పాట‌లు.. సాధార‌ణంగా నాగ‌శౌర్య సినిమాల‌పై ఉండాల్సిన అంచ‌నాల కంటే ఎక్కువ‌గానే ఛ‌లోపై ఉన్నాయి. పైగా ఈ సినిమాకు నాగ‌శౌర్య కుటుంబ‌మే నిర్మాత కావ‌డంతో ఆస‌క్తి మ‌రింత‌గా పెరిగింది. మ‌రి ఛ‌లో వీళ్ల అంచ‌నాలు నిల‌బెట్టిందా..?
క‌థ‌:
హ‌రి(నాగ‌శౌర్య‌)కు చిన్న‌ప్ప‌ట్నుంచీ గొడ‌వ‌లంటే ప్రాణం. చిన్న‌పుడే హ‌రి ఏడ్చిన‌పుడు ప‌క్క‌వాళ్ల‌ను కొట్ట‌మ‌ని చెబుతాడు తండ్రి (న‌రేష్). అందులోనే త‌న ఆనందాన్ని వెతుక్కుంటాడు. అదే పెద్ద‌వుతున్న కొద్దీ పెద్ద‌ద‌వుతుంది. ఆ అల‌వాటే తండ్రికి చిక్కులు తెచ్చి పెడుతుంది. హైద‌రా బాద్ లోనే ఉంటే అత‌డి లైఫ్ ఏమ‌వుతుందో అని భ‌య‌ప‌డి.. గొడ‌వ‌లంటే ఇష్టప‌డే హ‌రిని తీసుకెళ్లి గొడ‌వ‌ల‌తో అట్టుడుకిపోయే తిరుప్పురం అనే ఊళ్లోని కాలేజ్ లో ప‌డేస్తాడు తండ్రి. ఆ ఊళ్లో కొన్ని గొడ‌వ‌ల కార‌ణంగా తెలుగు, త‌మిళ వాళ్ళు ఊరి మ‌ధ్య కంచె వేసుకుని బ‌తుకుతుంటారు. ఇక్క‌డి వాళ్లు అక్క‌డ‌.. అక్క‌డి వాళ్లు ఇక్కడ రాకూడ‌దు అనేది ఆ ఊరి క‌ట్టుబాటు. అలాంటి ఊళ్లోని కాలేజ్ లోకి వెళ్తాడు హ‌రి. తొలి చూపులోనే కార్తిక‌(ర‌ష్మిక మంద‌న్న‌)ను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ సాధిస్తాడు. కానీ అనుకోని విధంగా ఆ ఊరి గొడ‌వ‌లు హ‌రి ప్రేమ‌కు అడ్డొస్తాయి. ఆ టైమ్ లో హ‌రి ఏం చేసాడు.. ఆ రెండు ఊళ్ల‌ను ఎలా కలిపాడు అనేది మిగిలిన క‌థ‌.
క‌థ‌నం:
కొన్ని సినిమాల‌కు లాజిక్స్ ఉండ‌వు. ఎంట‌ర్ టైన్మెంట్ అనే మ్యాజిక్ త‌ప్ప‌. మూడేళ్ల కింద ఆ మ్యాజిక్ క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్ లో క‌నిపించింది. ఆ సినిమాలో అస‌లు క‌థ ఉండ‌దు. ప్ర‌తీ సీన్ లోనూ న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా ముందుకెళ్ళాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు వెంకీ కుడుముల కూడా ఇదే చేసాడు. ద‌ర్శ‌కుడికి ద‌మ్ముండాలే గానీ గాడిద‌ను కూడా గుర్రమ‌ని న‌మ్మిస్తాడు. వెంకీ కుడుముల అది చేసి చూపించాడు. తొలి సినిమాతోనే త‌న క‌సి ఏ రేంజ్ లో ఉందో చూపించాడు. వెంకీకి బాగా తెలుసు.. తాను రాసుకున్న క‌థ పాత‌ద‌ని అందుకే కామెడీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. థియేట‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుడు ప్ర‌తీ సీన్ కు న‌వ్వుకున్నాడా లేదా అనేది చూసుకున్నాడంతే. ఆ లెక్క‌ల ప్ర‌కార‌మే ఛ‌లో ముందుకెళ్లింది.. క‌డుపుబ్బా న‌వ్వించింది.
త్రివిక్ర‌మ్ శిష్యుడు అంటే ఏమో అనుకుంటాం కానీ.. గురువుకు త‌గ్గ‌ట్లే పంచ్ డైలాగుల‌తో పిచ్చెక్కించాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో వెంకీ రాసిన డైలాగులు సినిమాను మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాయి. ఫ‌స్టాఫ్ అయితే ఎప్పుడు మొద‌లై.. ఎప్పుడు పూర్త‌యిందో తెలియ‌నంత వేగంగా వెళ్లిపోయింది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డ‌ల్ అయింది కానీ వెన్నెల కిషోర్ కామెడీ నిల‌బెట్టింది. రొటీన్ గా ఉంది.. లాజిక్ లేదు.. తెలిసిన క‌థే క‌దా.. ఇలాంటి రొటీన్ కంప్లైంట్స్ లేకుండా వెళ్తే.. ఈ ఛ‌లో క‌ళ్ల‌లో నీళ్లు తెప్పించేంత కామెడీ గ్యారెంటీ..
హీరోయిన్ తో కూడా కామెడీ చేయించాడు ద‌ర్శ‌కుడు. ఆమె కారెక్ట‌ర్ ను డిజైన్ చేసిన విధాన‌మే చాలా ఫ‌న్నీగా అనిపిస్తుంది. పైగా ఈ చిత్రంలో ఏ పాత్ర‌కు లాజిక్ ఉండ‌దు. అప్ప‌టికి చూసుకుని నవ్వుకోవాలంతే. చిన్న ట్విస్ట్ తో ఇంట‌ర్వెల్ కార్డ్ వేసి.. ఆ త‌ర్వ‌త కూడా ఫ‌న్ రైడ్ కొన‌సాగించాడు. అయితే ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డ‌ల్ అవుతుంది. క‌థ‌లో కాస్తైనా వెళ్లాలి కాబ‌ట్టి నెమ్మ‌దిస్తుంది. అయితే మ‌రీ బోర్ కొట్టించ‌కుండా వెన్నెల కిషోర్ ను రంగంలోకి దింపాడు. అత‌డు వ‌చ్చిన త‌ర్వాత క‌థ మ‌ళ్లీ న‌వ్వుల బాట ప‌ట్టింది. చివ‌ర్లో రెండు ఊళ్ల మ‌ధ్య ప‌గ ఎందుకో చిన్న పిట్ట‌క‌థ చెప్పి ముగించేసాడు ద‌ర్శ‌కుడు.
న‌టీన‌టులు:
నాగ‌శౌర్య బాగా చేసాడు. త‌న కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్న ఛ‌లో ను చాలా చ‌క్క‌గా డిజైన్ చేసుకున్నాడు శౌర్య‌. స్నేహితున్ని న‌మ్మి పెద్ద విజ‌యం అందుకోబోతున్నాడు. ద‌ర్శ‌కుడు చెప్పింది ఫాలో అయిపోయాడంతే. ఇక క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న సినిమాకు హైలైట్. త‌న ఎక్స్ ప్రెష‌న్స్ తో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె మొహంలో అన్ని ఎక్స్ ప్రెష‌న్స్ అద్భుతంగా ప‌లికాయ్. దానికి తోడు సొంత డ‌బ్బింగ్ కావ‌డంతో మ‌రింత ప్ల‌స్ అయింది. ఇక క‌మెడియ‌న్లుగా స‌త్య‌, సుద‌ర్శ‌న్, వైవా హ‌ర్ష కాలేజ్ కామెడీ చాలా బాగా పండించారు. ర‌ఘుబాబు ఓకే. సీనియ‌ర్ న‌రేష్ ఉన్నది కాసేపే అయినా హీరో తండ్రిగా బాగా చేసాడు. వెన్నెల కిషోర్ మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. సెకండాఫ్ ను సింగిల్ హ్యాండ్ తో నిల‌బెట్టాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.
టెక్నిక‌ల్ టీం:
ఛ‌లో తొలి క్రెడిట్ ఇవ్వాల్సింది సినిమాటోగ్ర‌ఫ‌ర్ సాయి శ్రీ‌రామ్ కు. ప్ర‌తీ ఫ్రేమ్ ను అందంగా చూపించాడు. త‌న కెమెరా మ్యాజిక్ తో సినిమాను మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. ఇక మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ కూడా త‌న వంతు సాయం చేసాడు. ముఖ్యంగా చూసి చూడంగానే సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మిగిలిన పాట‌లు కూడా ఓకే. ఎడిటింగ్ బాగుంది. స్పీడ్ క‌ట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇక ద‌ర్శ‌కుడు వెంకీ గురించి చెప్పుకోవాలి. తొలి సినిమానే అయినా కూడా ఎక్క‌డా అలా అనిపించ‌లేదు. తాను రాసుకున్న పాత క‌థ‌నే కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా డైలాగ్స్ ద‌గ్గ‌ర మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. తెలుగు, త‌మిళ వాళ్ల‌పై సెటైర్లు బాగానే రాసుకున్నాడు. బాహుబ‌లి లాంటి సినిమాల‌పై కూడా సెటైర్లు వేసాడు వెంకీ. ఓవ‌రాల్ గా ద‌ర్శ‌కుడిగా వెంకీ తొలి సినిమాతోనే స‌క్సెస్ అయ్యాడు.
చివ‌ర‌గా:
ఛ‌లో.. వినోదాలకు లే ఛ‌లో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here