మిడిల్ క్లాస్ అబ్బాయి రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20171221

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: మిడిల్ క్లాస్ అబ్బాయి
న‌టీన‌టులు: నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్ వ‌ర్మ..
సంగీతం: దేవీ శ్రీ ప్ర‌సాద్
నిర్మాత‌: దిల్ రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ వేణు

నానితో సినిమా అంటే ఇప్పుడు హిట్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చేసారు ప్రేక్ష‌కులు. ఈయ‌న డేట్స్ ప‌ట్ట‌డ‌మే ఇప్పుడు నిర్మాత‌ల‌కు వ‌రం. ఇక ద‌ర్శ‌కుడు క‌థ చెప్పి ఒప్పిస్తే హిట్ కొట్టిన‌ట్లే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈయ‌న న‌టించిన ఎంసిఏ విడుద‌లైంది. మ‌రి ఎనిమిదో విజ‌యం నాని ఖాతాలో ప‌డిందా..? ఎలా ఉంది ఈ చిత్రం..?

క‌థ‌:
నాని (నాని) మిడిల్ క్లాస్ అబ్బాయి. చిన్న‌ప్ప‌ట్నుంచీ అన్న‌య్య(రాజీవ్ క‌న‌కాల‌) ద‌గ్గ‌రే పెరుగుతాడు. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని.. అకేష‌న్ ను అన్న‌తోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు నాని. అలాంటి టైమ్ లో అన్న‌య్య పెళ్లి త‌ర్వాత నాని లైఫ్ లోకి వ‌దిన జ్యోతి (భూమిక‌) వ‌స్తుంది. త‌న‌ను అన్న‌య్య‌ను విడ‌దీసింది అని ఆమెపై ద్వేషం పెంచుకుంటాడు నాని. కొన్ని రోజుల త‌ర్వాత జ్యోతికి వ‌రంగ‌ల్ ట్రాన్స్ ఫ‌ర్ అవుతుంది. అక్క‌డే ఆమె ఆర్టీవోగా ప‌ని చేస్తుంటుంది. వ‌దిన‌కు తోడుగా నాని వ‌రంగ‌ల్ వెళ్లాల్సి వ‌స్తుంది. అక్క‌డే ప‌ల్ల‌వి (సాయిప‌ల్ల‌వి) నానిని చూసి ఫ‌స్ట్ లుక్ లోనే చూసి ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ టైమ్ లోనే జ్యోతి త‌న డ్యూటీ కార‌ణంగా వ‌రంగ‌ల్ శివ‌(విజ‌య్ వ‌ర్మ‌)తో వైరం పెంచుకుంటుంది. దాంతో అప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగుతున్న వాళ్ల జీవితాలు ఒక్క‌సారిగా మారిపోతాయి. అస‌లు జ్యోతికి, శివకు మ‌ధ్య గొడవ ఏంటి.. నాని ఎందుకు శివను కొడ‌తాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం:
నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ సినిమా త‌ర్వాత ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో వ‌చ్చాడు నాని. ఈయ‌న సినిమా అంటే కొత్త క‌థ ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో ఉంది. కానీ నాని కూడా తాను రొటీన్ హీరోనే అని నిరూపించుకుంటున్నాడు. నేనులోక‌ల్ తో ఇప్ప‌టికే ఓ సారి రొటీన్ క‌థ చేసి కూడా హిట్ కొట్టాడు నాని. ఇక ఇప్పుడు మ‌రోసారి అదే చేసాడు నాని. ఎంసిఏ కొత్త క‌థేం కాదు. ఇంకా చెప్పాలంటే ట్రైల‌ర్ లోనే క‌థ చెప్పారు చిత్ర‌యూనిట్. వ‌దినంటే ప‌డ‌ని మ‌రిది.. ఆమెతో ఉండాల్సిన ప‌రిస్థితి.. అప్పుడే హీరోయిన్ ను చూసి ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆ త‌ర్వాత విల‌న్ ఎంట్రీ.. ఇలా ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం మ్యాప్ వేసుకున్న‌ట్లు సాగిపోతుంది ఎంసిఏ క‌థ‌. తెలివిగా ఫ‌స్టాఫ్ అంతా నాని, సాయిప‌ల్ల‌విపైనే ఎక్కువ‌గా న‌డిపించాడు. దానికితోడు వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్నీ సీన్స్ బాగానే పండాయి. ఇంట‌ర్వెల్ కు వ‌దిన‌పై మంచి ఇంప్రెష‌న్ వ‌చ్చేలా డిజైన్ చేసిన సీన్ రేసుగుర్రం గుర్తు చేస్తుంది. సినిమా అంతా అదే స్క్రీన్ ప్లేలో సాగిపోతుంది.
రేసుగుర్రంలో బ‌న్నీ అన్న‌య్య సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్. అక్క‌డ విల‌న్ తో ప్రొఫెష‌న‌ల్ గా గొడ‌వ వ‌స్తుంది. అక్క‌డ బ‌న్నీ త‌ల దూరుస్తాడు. ఇక్క‌డ కూడా అంతే. ఆర్టీవోగా త‌న ప‌ని తాను చేసినందుకు విల‌న్ నాని వ‌దిన జీవితంలోకి వ‌స్తాడు. అప్పుడు హీరో క‌ల‌గ‌జేసుకోవ‌డం.. విల‌న్ ఏమో హీరోతో ఛాలెంజ్ చేయ‌డం.. సెకండాఫ్ అంతా విల‌న్ చేసిన ఛాలెంజ్ నెర‌వేర‌కుండా హీరో అడ్డుకోవ‌డం.. ఇలా రేసుగుర్రంను గుర్తు చేస్తూ సాగిపోతుంది క‌థ‌. కానీ సెకండాఫ్ లో ఎత్తులు పై ఎత్తులు ఆస‌క్తిగా అనిపించ‌వు. ఇలాంటి క‌థ‌ల్లో ఎత్తుకు పై ఎత్తు ప‌డుతుంటే క‌థ‌లో ఆస‌క్తి ఉంటుంది. కానీ ఎంసిఏలో ఇవేవీ క‌నిపించ‌వు. సెకండాఫ్ అంతా రొటీన్ గా సాగిపోతుంది. క్లైమాక్స్ వ‌ర‌కు ఏ ట్విస్ట్ లేకుండా అలా వెళ్లిపోతుంది. మ‌ధ్య‌లో వ‌చ్చే సాయిప‌ల్ల‌వి సీన్స్ కాస్త రిలీఫ్ అనిపిస్తాయి. ఓవ‌రాల్ గా మ‌రోసారి రొటీన్ సినిమాతోనే వ‌చ్చాడు వేణు శ్రీ‌రామ్. నాని కూడా..!

న‌టీన‌టులు:
నాని బాగా చేసాడు అని చెప్ప‌డంలో అర్థం లేదు. ఎందుకంటే నాని బాగా చేస్తాడు. అది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయిగా కూడా ర‌ప్ఫాడించాడు. సాయిప‌ల్ల‌వి మ‌రోసారి మ్యాజిక్ చేసింది. ఈమె వ‌చ్చిన ప్ర‌తీ సీన్ సినిమాలో చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో ఏకంగా నానినే డామినేట్ చేసింది కూడా. ఇక విల‌న్ గా విజ‌య్ వ‌ర్మ ఓకే. మెకానికల్ గా అనిపించాడు. సినిమాకు ప్రాణం వ‌దిన పాత్ర‌. ఈ పాత్ర‌లో భూమిక జీవించింది. మిగిలిన వాళ్ల‌లో ప్రియ‌ద‌ర్శి.. పోసాని.. న‌రేష్.. ఇలా అంతా వ‌చ్చి వెళ్లిపోతారు. బాగానే చేసారు. వెన్నెల కిషోర్ ఉన్న‌ది రెండు సీన్లే అయినా న‌వ్వించాడు.

టెక్నిక‌ల్ టీం:
దేవీ శ్రీ ప్ర‌సాద్ ఎంసిఏకు న్యాయం చేసాడు. మాస్ కు కావాల్సిన ట్యూన్స్ ఇచ్చేసాడు. ముఖ్యంగా ఏమండోయ్ నానిగారు పాట అదిరిపోయింది. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ లో కాస్త క‌త్తెర ప‌డాల్సిందేమో..? స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఏమైందో తెలియదు నాకు పాట‌లో విజువ‌ల్స్ చాలా బాగున్నాయి. ఇక క‌థ పాత‌దే రాసుకున్నాడు వేణు శ్రీ‌రామ్. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే ఉంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అదిరిపోయిన సినిమా.. ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోయింది. సెకండాఫ్ లో కూడా కొన్ని సీన్లు ప‌డుంటే మ‌రో రేంజ్ లో ఉండేవాడు మిడిల్ క్లాస్ అబ్బాయి. ప‌డ‌లేదు.. అందుకే యావ‌రేజ్ దగ్గ‌రే ఆగిపోయాడు.

చివ‌ర‌గా:
ఎంసిఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి.. స‌గంలోనే ఆగిన జ‌ర్నీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here