విజేత‌గా వ‌స్తున్న చిన్న‌ల్లుడు..


మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ కూడా హీరో అయ్యాడు ఇప్పుడు. ఈయ‌న తొలి సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆ మ‌ధ్య జ‌త‌క‌లిసేతో ద‌ర్శ‌కుడిగా మారిన రాకేశ్ శ‌శి ఇప్పుడు అల్లుడుతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.
దీనికి ఇప్పుడు విజేత అనే టైటిల్ పెట్టారు. 1985లో చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది. టైటిల్ ను మాత్ర‌మే వాడుకుంటున్నారా.. లేదంటే క‌థ‌ను కూడా స్పూర్తి పొందారా అనేది చూడాలిక‌. కానీ అల్లుడికి మాత్రం త‌న టైటిల్ ఇచ్చేసాడు మెగాస్టార్. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో స‌క్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం.
క‌థ‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ టైటిల్ పెట్టారు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ సుమాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ దేవ్ కు తోడుగా చాలా మంది సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కూడా ఉన్నారు. పోసాని, నాజ‌ర్, ముర‌ళి శ‌ర్మ‌, రాజీవ్ క‌న‌కాల లాంటి వాళ్లు విజేత‌లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here