‘2 కంట్రీస్’ ఫస్ట్ లుక్, టీజర్ మరియు చిత్ర విడుదల వివరాలు

ప్రతిష్టాత్మక మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ‘2 కంట్రీస్’ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. హీరో సునీల్, మనీషా రాజ్ జంటగా ఒక చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, మలయాళం లో ఇదే పేరుతో వచ్చి విజయం సాధించిన చిత్రం యొక్క రీమేక్. ఇటీవలే, టైటిల్ లోగో విడుదలయ్యి అందరిని ఆకట్టుకుంది.
‘జై బోలో తెలంగాణ’, ‘శ్రీ రాములయ్య’, ‘భద్రాచలం’, ‘జయం మనదేరా’ వంటి ఎన్నో కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించిన ఎన్.శంకర్, ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారని తెలుస్తుంది. ‘2 కంట్రీస్’ అమెరికా మరియు ఇండియా లోని ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకొని డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

“టైటిల్ లోగోకు మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ‘2 కంట్రీస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేశాము. టీజర్ నవంబర్ 24 న విడుదల చేయ నిశ్చయించాము. చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నాము. 2 కంట్రీస్ భారీ బడ్జెట్ తో, ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మించబడింది. హీరో గా సునీల్ కు ఈ చిత్రం అద్భుత విజయానందిస్తుందని,” చెప్పారు ఎన్.శంకర్.

తారాగణం:
సునీల్, మనీషా రాజ్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, షిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, శేషు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఝాన్సీ మరియు ఇతరులు.

సాంకేతిక విభాగం:
బ్యానర్: మహా లక్ష్మి ఆర్ట్స్
స్క్రీన్ప్లే, దర్శకత్వం మరియు నిర్మాత: ఎన్.శంకర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: గోపిసుందర్
చాయాగ్రాహకుడు: సి.రాంప్రసాద్
మాటలు: శ్రీధర్ సీపాన
ఆర్ట్ డైరెక్టర్: ఏ.ఎస్.ప్రకాష్
కో డైరెక్టర్: కే.విజయ సారధి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కే.వెంకటరమణ