జబర్దస్త్ లో తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. సినిమాల్లో కూడా ఈ మధ్య బాగానే ట్రై చేస్తున్నాడు. కాకపోతే బుల్లితెరపై వర్కవుట్ అయినట్లు వెండితెరపై కావడం లేదు. తొలిప్రేమ సినిమా మినహా మేడ మీద అబ్బాయి, మిస్టర్ మజ్ను సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి. దాంతో మళ్లీ బుల్లితెరపై కాన్సంట్రేట్ చేస్తున్నాడు హైపర్ ఆది. దాంతో పాటు రాజకీయాల వైపు కూడా అడిగేస్తున్నాడు. జనసేన తరపున ఈయన ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. ఇప్పటికే వైసీపీ నాయకులతో కూడా పెట్టుకున్నాడు హైపర్ ఆది.
ఈ విషయం బాగానే సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి విషయాల్లో దూరంగా ఉండటమే మంచిదని ఆయనకు వార్నింగ్ లు కూడా వెళుతున్నాయి. ఇదే సమయంలో బాలకృష్ణతో తన వివాదం గురించి కూడా మనసులో మాట బయట పెట్టాడు హైపర్ ఆది. అప్పట్లో జబర్దస్త్ లో చేసిన ఒక స్కిట్ కారణంగా బాలయ్య అభిమానులు తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు యూట్యూబ్ లో రాసి ప్రచారం చేసినట్లు హైపర్ ఆది గుర్తుచేసుకున్నాడు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని.. కేవలం యూట్యూబ్ ఛానల్ తమ రేటింగ్ కోసం తనను పావుగా వాడుకున్నారని చెప్పాడు హైపర్ ఆది. అప్పట్లో తమ టీం చేసిన ఒక స్కిట్ కి బాలయ్య అభిమాని ఒకరు ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ.. వార్నింగ్ మాత్రం ఇవ్వలేదని.. అదేదో చిన్న సలహా మాదిరి ఇచ్చారని గుర్తుచేశారు ఆది. మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు హైపర్ ఆది పేరు కామెడీ కంటే కాంట్రవర్సీలోనే ఎక్కువగా వినిపిస్తోంది.