కూతురు పెళ్లిలో చిందులేసిన సూపర్ స్టార్ రజినీకాంత్..

రజినీకాంత్ డాన్సులు వేయడం చాలా అరుదు. సినిమాల్లో కూడా ఆయన తన మార్క్ స్టెప్స్ కొన్ని ఉంటాయి. అవి మాత్రమే రిపీట్ చేస్తూ ఉంటాడు సూపర్ స్టార్. ఇక బయట ఆయన డాన్సులు చేయడం ఇప్పటివరకు జరగలేదు. ఎప్పుడూ జరగదు అని అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు తన కూతురు పెళ్లి లో డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.. ముత్తు సినిమాలో ఒకడే ఒక్కడు మొనగాడు పాట స్టెప్పులేశాడు రజినీకాంత్. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కూతురు సౌందర్య రజనీకాంత్ పెళ్లి వేడుకలో చాలా ఎంజాయ్ చేశాడు సూపర్ స్టార్. ఫిబ్రవరి 10న ఈ పెళ్లి జరిగింది.

 

 

 

సౌందర్యకు ఇది రెండో పెళ్లి. ప్రముఖ బిజినెస్ మాన్ విషాగన్ వనంగమూడీతో ఈమె వివాహం జరిగింది. 2010లో సౌందర్యకు తొలి వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు బాగానే కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత విడిపోయింది. వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది సౌందర్య రజనీకాంత్. పెళ్లి వేడుక పెద్దగా సందడి లేకుండా సాగినా రిసెప్షన్ మాత్రం అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఇందులోనే కోలీవుడ్ హీరో హీరోయిన్లు డాన్సులు కూడా చేశారు. రజినీకాంత్ కూడా ఇదే వేడుకలో కాళ్ళు కదిపాడు. మొత్తానికి సౌందర్య రజనీకాంత్ పెళ్లి ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here