పేట సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20190110

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: పేట

నటీనటులు: రజినీకాంత్ త్రిష సిమ్రాన్ విజయ్ సేతుపతి నవాజుద్దీన్ సిద్దిఖీ బాబీ సింహ మేఘ ఆకాష్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాతలు: సన్ పిక్చర్స్ అశోక్ వల్లభనేని

రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్

గతంలో రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే అంచనాలు ఆకాశంలో ఉండేవి. కానీ కొన్నేళ్లుగా ఆయన ఫ్లాపుల్లో ఉండటం వల్ల అతి తక్కువ అంచనాల మధ్య విడుదల అయ్యింది పేట. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ..

రజినీకాంత్ ఓ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తుంటాడు. ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ఆయన జీవితంలో రాజకీయ నాయకుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఆయన కొడుకు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తారు. హాయిగా సాగిపోతున్న రజనీ జీవితాన్ని నాశనం చేస్తారు. దాంతో ఆయన పాత రూపం వదిలి హాస్టల్ వార్డెన్ గా కొత్తగా జీవితాన్ని మొదలు పెడతాడు. ఆ సమయంలోనే సిమ్రాన్ ను కలుసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ అక్కడ బాబి సింహతో మళ్లీ రజనీకాంత్ కు గొడవ మొదలవుతుంది. అసలు వీళ్ళందరికీ రజనీకి ఏంటి గొడవ.. ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది కథ..

కథనం..

రజనీకాంత్ స్క్రీన్ పై రెచ్చి పోతూ ఉంటే అభిమానులకు చూడటానికి అంతకంటే మరోటి అవసరం లేదు. కొన్ని రోజులుగా ప్రతి సినిమాలో ఇది మిస్ అవుతూ వస్తుంది. కానీ కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం బేరీజు వేసుకొని మరీ రజనీకాంత్ సినిమా అంటే ఎలా ఉండాలో అలాగే తెరకెక్కించాడు. పేట సినిమాను ఏ నమ్మకంతో అయితే రజనీకాంత్ తనకు ఈ సినిమాను ఇచ్చాడో దానికి పూర్తి స్థాయి న్యాయం చేశాడు ఈ కుర్ర దర్శకుడు. పాత కథనే తీసుకున్నా కూడా దానిని కొత్తగా తన స్క్రీన్ప్లేతో ఆసక్తికరంగా మార్చేశాడు. దానికి తోడు రజనీకాంత్ కూడా ఈ మధ్య ఏ సినిమా లో లేనంత కొత్తగా కనిపించాడు. భాషా సినిమాను గుర్తుచేస్తూ చాలా సన్నివేశాలు రాసుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఇంటర్వెల్ వరకు కూడా భాషా ఫ్లాష్ బ్యాక్ లా దాచి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు కార్తీక్. రజనీకాంత్ ఇమేజ్ ను పూర్తిగా వాడుకుంటూ దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పూర్తిగా రజనీ ఇమేజ్ చుట్టూనే తిప్పాడు. ఒక్కసారి సెకండాఫ్ మొదలైన తర్వాత పేట వీర యాక్షన్ మొదలైంది. అయితే తమిళ వాసనలు ఎక్కువగా ఉండటం సెకండాఫ్ కు మైనస్ గా మారింది. అప్పటివరకు ఫస్టాఫ్ లో పూర్తిగా రజిని స్టయిల్ చూసిన ప్రేక్షకులకి సెకండాఫ్ లో మాత్రం తమిళ సినిమాను చూపించేసాడు కార్తీక్ సుబ్బరాజ్. రొటీన్ స్టోరీ కావడం పేటకు ప్రధానమైన మైనస్. అయితే స్క్రీన్ప్లేలో కొత్తదనం ఈ సినిమా కు ప్లస్ గా మారుతుంది. రజనీకాంత్ అభిమానులకు పండగ చేసుకునే సినిమా పేట. కానీ నార్మల్ ఆడియన్స్ కు మాత్రం అంతగా ఇస్తుందా లేదా అనేది చూడాలి.

నటీనటులు..

రజనీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా చంపేస్తాడు అంతే. ఇప్పుడు కూడా హాస్టల్ వార్డెన్ గా.. పేట వీరగా రెండు పాత్రలతో అదరగొట్టాడు. టీనేజ్ కూతురు తల్లిగా బాగా చేసింది సిమ్రాన్. త్రిష చిన్న పాత్రలో మెరిసింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహ, మేఘ ఆకాష్ ఇలా ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్లు ఒదిగిపోయారు.

టెక్నికల్ టీం

అనిరుధ్ సంగీతం పేటకు ప్లస్. మాస్ మరణం సాంగ్ అద్భుతంగా ఉంది. రజనీ డాన్సులు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.. అయితే ఎడిటింగ్ మైనస్ గా మారింది ఈ సినిమాకు. లెంత్ ఎక్కువగా ఉండటం పేటకు మైనస్. కార్తిక్ మరోసారి రొటీన్ కథని కాస్త కొత్త స్క్రీన్ప్లే జోడించి తెరకెక్కించాడు. తమిళ ప్రేక్షకులకు ఓకే కానీ తెలుగు వాళ్లకు ఎంతవరకు నచ్చుతుంది అనేది చూడాలి.

చివరగా..
తమిళ్ లో ఆట కానీ తెలుగులో మాత్రం… కష్టమేనంట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here