వినయ విధేయ రామ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20190111

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: వినయ విధేయ రామ
నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, మధుమిత, ఆర్యన్ రాజేష్ తదితరులు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: డివివి దానయ్య
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: బోయపాటి శ్రీను

కథ..
రామ్ చరణ్ ఆయన అన్నదమ్ములు అందరూ అనాధలు చిన్నప్పుడే అంతా ఒకచోట చేరతారు. కుటుంబానికి అండగా నిలుస్తాడు అందరికంటే చిన్న వాడు అయిన రామ్. ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆయనే ముందుంటాడు. అలాంటి కుటుంబం కి వివేక్ ఒబెరాయ్ రూపంలో అనుకోని కష్టం ఎదురవుతుంది. ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న రామ్ అన్నయ్య ప్రశాంత్ వివేక్ ఉన్న ప్లేస్ కు వెళ్లి ఎదిరిస్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ ను వివేక్ పట్టుకొని తన ప్లేస్ కి తీసుకెళ్తాడు. అప్పటి నుంచి తన కుటుంబం కోసం రామ్ ఫైట్ చేశాడు అనేది కథ.

కథనం..
ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నటుడిపై ప్రేక్షకుల ఆలోచన శైలి మారడానికి పదేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా రంగస్థలంతో నటుడిగా అగ్రస్థానానికి వెళ్ళిపోయాడు రామ్ చరణ్. అలాంటి సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా అనగానే అభిమానుల్లో లేనిపోని భయాలు వచ్చాయి. రొటీన్ సినిమాలు చేసి దర్శకుడితో మళ్లీ ఎందుకు పని చేస్తున్నాడు అంటూ అభిమానులు కూడా భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళ అనుకున్నదే జరిగేలా కనిపిస్తుంది. వినయ విధేయ రామ సినిమాను బోయపాటి తెరకెక్కించిన తీరు చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఎమోషనల్ సీన్స్ తోనే సినిమాను నడిపించిన బోయపాటి సినిమాలో మాత్రం అలాంటివి చూపించలేదు. ఒక్క సీన్ కూడా అదుర్స్ అనిపించలేదు. ఫస్టాఫ్ అక్కడక్కడ యాక్షన్ సీన్లతో పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఎటో తెలియని ప్రయాణంలా మారిపోయింది.
హీరో ఎక్కడికి పడితే అక్కడికి అలా ఎలా వస్తాడో తెలియదు.. వందల మందిని ఎలా చంపేస్తాడో తెలియదు ఎంత లాజిక్ వదిలేద్దాం అనుకున్నా కూడా అక్కడ సీన్లు చూస్తుంటే బుర్ర పని చేయదు. అలా కొన్ని సీన్లు తెరకెక్కించాడు బోయపాటి శ్రీనుఎం ఎయిర్ పోర్ట్ లో హీరో పరిగెడితే నెక్స్ట్ షాట్ లో రన్నింగ్ ట్రైన్ పై నిలబడతాడు. అక్కడే ఉన్న గుర్రంపై ఎక్కి వందల మంది పై బాంబులు వేస్తాడు. అసలు సంబంధం లేని సన్నివేశాలతో సెకండ్ హాఫ్ లో పిచ్చి పిచ్చిగా తీసాడు. బోయపాటి శ్రీను పాపం రామ్ చరణ్ కూడా ఏం మాట్లాడకుండా ఈ దర్శకుడు చెప్పిందల్లా చేస్తూ పోయాడు. ఓవరాల్ గా ప్రేక్షకులను అభిమానులను కూడా మెప్పించలేని సినిమాగా మారిపోయింది వినయ విధేయ రామ.

నటీనటులు..
రామ్ చరణ్ కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్త కాదు.. మాస్ హీరోగా తన కున్న ఇమేజ్ వాడుకుంటూ రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. కానీ రంగస్థలం లాంటి సినిమా తర్వాత నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు ప్రేక్షకులు. కైరా అద్వానీ కేవలం అందాల ఆరబోతకే సరిపోయింది. ప్రశాంత్ ఉన్నంతలో బాగా చేశాడు. విలన్ గా వివేక్ ఒబేరాయ్ అదుర్స్ అనిపించాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్ ఇలాంటి వాళ్లంతా తమ పాత్రల వరకు మెప్పించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోలేదు. పాటలు ముందునుంచే పెద్దగా వినపడలేదు. ఇప్పుడు సినిమాలో విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్లేదు.. ఎడిటింగ్ చాలా దారుణంగా ఉంది. సినిమా చాలా బోర్ కొట్టింది. బోయపాటి శ్రీను కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. తెలిసిన కథనే మరింత రొటీన్గా తెరకెక్కించాడు దర్శకుడు. కెరీర్లో తొలిసారి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు బోయపాటి శ్రీను.

చివరగా..
రామ్ చరణ్ ను నమ్మించి మోసం చేసిన బోయపాటి..

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here