యాత్ర సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎన్నో తెలుసా..

మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఏకంగా నాలుగు కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే డిస్ట్రిబ్యూటర్లకు పంట పండినట్లే. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా ఆసక్తి కనిపించలేదు.. కానీ విడుదలకు దగ్గర పడుతున్న కొద్ది చేసిన ప్రమోషన్.. విడుదలైన విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ఇప్పుడు సినిమాకు టాక్ కూడా చాలా బాగా ఉండటంతో కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.

yatra first day collections
వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోయడంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ అద్భుతంగా వర్కవుట్ కావడంతో అది కలెక్షన్ల రూపంలో కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. మొత్తంగా వీకెండ్ ముగిసే లోపు ఈ చిత్రం కచ్చితంగా 10 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదేగాని జరిగితే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం ఖాయం. ఎందుకంటే రాబోయే రెండు వారాలు కూడా పెద్దగా సినిమాలు లేవు. దాంతో యాత్ర సినిమా పండగ చేసుకోవడం పక్కా అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here