అంత‌రిక్షంలోకి వ‌రుణ్ తేజ్ ప్ర‌యాణం..


వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం య‌మా బిజీగా ఉన్నాడు. రెండు సినిమాల‌కు క‌మిట్ మెంట్ ఇచ్చి.. మూడు సినిమాల క‌థ‌ల‌తో మామూలు బిజీగా లేడు ఈ కుర్ర హీరో. తొలిప్రేమ త‌ర్వాత ఈయ‌న ఇమేజ్ మ‌రింత‌గా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డితో ఓ స్పేస్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. దీనికి ఇన్నాళ్లూ అహం బ్ర‌హ్మ‌స్మి టైటిల్ అనుకున్నారు కానీ ఇప్పుడు అంత‌రిక్షం అనుకుంటున్నారు. క‌థంతా అక్క‌డే తిరుగుతుంది కాబ‌ట్టి ఈ టైటిల్ అయితేనే ప‌ర్ ఫెక్ట్ అని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఘాజీ లాంటి సంచ‌ల‌న సినిమా త‌ర్వాత సంక‌ల్ప్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో ఆస‌క్తి కూడా అలాగే ఉంది.
పైగా క్రిష్ దీనికి నిర్మాత కావ‌డం మ‌రో విశేషం. భారీ బ‌డ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు క్రిష్‌. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇక్క‌డే హాలీవుడ్ నిపుణుల సార‌థ్యంలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జ‌రుగుతుంది. దీనికోసం ప్ర‌త్యేకంగా క‌జ‌కిస్థాన్ వెళ్లి అప్ప‌ట్లో జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చాడు వ‌రుణ్ తేజ్. జులైలోపు ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు వ‌రుణ్ తేజ్. లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మొత్తానికి ఈ అంత‌రిక్షంతో మెగా హీరో ఎలాంటి మాయ‌లు చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here