అంత కోప‌మేలా అర్జున కుమారా..? 


శ్రీ‌దేవి చ‌నిపోయినందుకు ప్ర‌పంచమంతా ఆమె అభిమానులు బాధ ప‌డుతున్నారు. ఇక ఇండ‌స్ట్రీ వాళ్ల‌కైతే ఆ లోటు ఎప్పుడూ తీర్చ‌లేం అంటూ క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఆమెతో అనుబంధం ఉన్నోళ్లంతా గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. మ‌రి బ‌య‌టి వాళ్ల‌కే ఇంత బాధ ఉంటే.. కుటుంబ స‌భ్యుల‌కు ఎలా ఉంటుంది ఇక‌..? ఆ భాద‌ను చెప్ప‌డం కూడా ఎవ‌రి త‌రం కాదు. కానీ శ్రీ‌దేవి మ‌ర‌ణంపై ఒక్క‌రు మాత్రం పెద్ద‌గా చ‌లించ‌ట్లేదు. అత‌డే అర్జున్ క‌పూర్. ఈయ‌న తీరు ఇప్పుడు బాలీవుడ్ లో కాస్త వింత‌గా అనిపిస్తుంది. శ్రీ‌దేవి అత‌డికి సొంత త‌ల్లి కాదు.. పిన‌త‌ల్లి. ఎంత పిన‌త‌ల్లి అయినా కూడా రిలేష‌న్ అయితే ఉంటుంది క‌దా.. పోయిన‌పుడు బాధ ఉంటుంది క‌దా అనుకున్నారంతా. కానీ ఆ ఫీలింగ్స్ ఏవీ ఇప్పుడు అర్జున్ లో క‌నిపించ‌ట్లేదు. నిజం చెప్పాలంటే శ్రీ‌దేవి అంటే చిన్న‌ప్ప‌ట్నుంచే అర్జున్ లో కోపం ఉండేద‌ని అత‌డి స‌న్నిహితులు చెప్తారు. ఇన్నేళ్ళ‌లో ఆమె ఉన్న‌పుడు కూడా ఎప్పుడూ శ్రీ‌దేవితో ఒక్క‌సారి కూడా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడ‌లేదు అర్జున్ క‌పూర్.
ఈ విష‌యం చెప్పింది కూడా ఆయ‌నే. త‌న తండ్రిని త‌న నుంచి దూరం చేసింద‌ని చిన్న‌పుడే శ్రీ‌దేవిపై క‌సి పెంచుకున్నాడు ఈ అర్జున కుమారుడు. ఈయ‌న కోపంలోనూ అర్థం ఉంది కానీ ఇప్పుడైనా ఆ ప‌ట్టుద‌ల వ‌దిలేస్తే బాగుంటుందంటున్నారంతా. ఈ విష‌యం ఇప్పుడు ఎందుకు చ‌ర్చ‌కు వ‌చ్చిందంటే.. ముంబై ఎయిర్ పోర్ట్ లో శ్రీ‌దేవి మ‌ర‌ణం గురించి మాట్లాడ‌మ‌ని మీడియా అడుగుతుంటే కెమెరాల‌ను తోసేసి బ‌య‌టికి వెళ్లిపోయాడు అర్జున్. ఆ త‌ర్వాత ఇంటి ద‌గ్గ‌ర కూడా సేమ్ సీన్ రిపీట్ చేసాడు. ఎంత కోపాలు ఉన్నా కూడా మ‌నిషి పోయిన త‌ర్వాత కూడా అవి చూపించ‌డం మాత్రం మంచిది కాదంటున్నారు. కానీ అర్జున్ క‌పూర్ కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం క‌చ్చితంగా ఆయ‌న కోపంలో అర్థం ఉంది. మ‌రి చూడాలిక‌.. ఇక‌పై శ్రీ‌దేవి కూతుళ్ళ‌తో అన్న‌గా అర్జున్ ఎలా ఉండ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here