అందాల‌తో మ‌ళ్లీరావా ఆకాంక్ష‌..

మ‌ళ్లీరావా.. గ‌తేడాది వ‌చ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. ఇందులో హీరోయిన్ గా న‌టించింది ఆకాంక్ష సింగ్. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు.. కానీ మ‌ళ్లీ రావా హీరోయిన్ అంటే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో కొన్ని సీరియ‌ల్స్ చేస్తూ బిజీగా ఉంది ఆకాంక్ష‌. దానికి త‌గ్గ‌ట్లే అందాల ఆర‌బోత‌లోనూ ఇలాగే రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఈ భామ‌కు పెళ్లైపోయింది కూడా. పెళ్లై నాలుగేళ్లు దాటేసింది. 2013లోనే త‌న బాయ్ ఫ్రెండ్ కునాల్ సైన్ తో ఏడడుగులు న‌డిచింది ఆకాంక్ష సింగ్. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ‌. త‌న కెరీర్ కు భ‌ర్తే ద‌గ్గ‌రుండి ఎంక‌రేజ్ చేస్తున్నాడు అని చెబుతుంది ఆకాంక్ష‌. ఇక ఈ మ‌ధ్యే అదిరిపోయే హాట్ హాట్ షో ఒక‌టి చేసింది ఈ భామ‌. దీనికి కూడా భ‌ర్త నుంచి ప‌ర్మిష‌న్ వ‌చ్చింద‌ని చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌ళ్లీ రావా త‌ర్వాత తెలుగులో మ‌రో అవ‌కాశం కోసం చూస్తుంది ఈ భామ‌. మ‌రి ఈమె కోరిక‌ను మ‌న్నించి ఆకాంక్ష ఆకాంక్ష‌ను ఏ ద‌ర్శ‌కుడు తీరుస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here