అందాల కంచె తెంచేసిందిగా..!

ప్ర‌గ్య‌జైస్వ‌ల్.. తెలుగులో చాలా రోజులైంది ఈ పేరు వినిపించ‌క‌. న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయిన‌వే. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు ఆడిన సినిమాలు లేవు. దాంతో ఇప్పుడు అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుంటుంది ప్ర‌గ్యా. ఇండ‌స్ట్రీలో రాణించాలంటే చాలా మార్గాలుంటాయి.

అందులో అందాల ఆర‌బోత ఒక‌టి. ఇప్పుడు ప్ర‌గ్యాజైస్వ‌ల్ చేస్తుంది ఇదే. వీళ్ల‌కు హిట్లు ఫ్లాపుల‌తో ప‌ని లేదు. కంచెలో అద్భుతంగా న‌టించినా ఎవ‌రు ప‌ట్టించుకోలేదు దాంతో రెండో మార్గాన్నే ఎంచుకుంది ఈ భామ‌. న‌క్ష‌త్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధ‌రంతేజ్ తో రెచ్చిపోయిన ప్ర‌గ్యా.. ఆ సెగ‌లు త‌గ్గ‌క‌ముందే బోయ‌పాటి శీను జ‌య జాన‌కి నాయ‌కాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది.

ఇక మొన్న ఆచారి అమెరికా యాత్ర‌లోనూ బాగానే అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు ఎరుపు డ్ర‌స్ లో అరిపించేస్తుంది ఈ బ్యూటీ. అస‌లే బాలీవుడ్ నుంచి వ‌చ్చిన భామ క‌దా.. ఇక్క‌డ అస‌లు అడ్డూ అదుపులేమీ లేవు. రెడ్ డ్ర‌స్ లో ఆమెను చూస్తుంటే అమ్మో చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే..! మొత్తానికి హిట్లు లేక‌పోయినా కేవ‌లం ఈమె అందాల ఆర‌బోత కోస‌మైనా పిలిచి మ‌రి ఆఫ‌ర్లు ఇచ్చేలా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here