అందాల పూజ‌కు వేళాయెరా..!

 


కొంద‌రు హీరోయిన్ల జాత‌కం అలా ఉంటుంది మ‌రి. వాళ్ల‌కు హిట్లు లేక‌పోవ‌చ్చు కానీ క్రేజ్ మాత్రం బోలెడు ఉంటుంది. అది వాళ్లు చేసే గ్లామ‌ర్ షో వ‌ల్లే కావ‌చ్చు.. ఇంకేదైనా కావ‌చ్చు. ఇప్పుడు పూజాహెగ్డే కూడా ఇంతే. ఈమె న‌టించిన ముకుందా.. ఒక లైలా కోసం.. డిజే.. ఏదీ హిట్ కాదు. కానీ పూజా మాత్రం తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. దానికి కార‌నం ఆమె అందాల ఆర‌బోత‌. డిజే యావ‌రేజ్ గా ఆడినా.. ఆమె అందాల ఆర‌బోత మాత్రం సూప‌ర్ హిట్టైంది. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ కు.. బ‌య‌ట జ‌రిగే ఫంక్ష‌న్ ల‌కు పూజాహెగ్డే త‌న గ్లామ‌ర్ షోతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఈమె అందాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. సినిమాలో చూపించిన‌ట్లు ఈమె అందాల‌ను చూసి సీటీమార్ అంటున్నారు కుర్ర‌కారు. ఈ మ‌ధ్యే ఓ ఈవెంట్ కు వ‌చ్చిన పూజా.. అక్క‌డ కూడా అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుంది. ఈ బ్యూటీ గ్లామ‌ర్ చూసి కెవ్వుకేక అంటున్నారు కుర్రాళ్లు. ఇక ఓ ఫోటో షూట్ లో కూడా అందాల ఆయుధాన్నే నేరుగా ప్ర‌దర్శించింది పూజాహెగ్డే. అలా ఉంది మ‌రి అమ్మాయిగారి ర‌చ్చ‌. మొత్తానికి డిజేతో కోరుకుంటున్న బ్రేక్ అందుకుంది పూజా. ప్ర‌స్తుతం తెలుగులో బెల్లంకొండ సురేష్ హీరోగా శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్న సాక్ష్యం సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో భారీ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా అడుగుతున్నార‌ని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here