అందాల మీరా.. వేస్తుంది సొగ‌సుల చెర‌..!


చూస్తున్నారుగా.. ఇక్క‌డ ఉన్న‌ది ఎవ‌రో హీరోయిన్ కాదు. కానీ హీరోయిన్ల కంటే త‌క్కువ అందం ఏం కాదు. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న‌ది స్టార్ హీరో షాహిద్ క‌పూర్ అర్ధాంగి మీరా రాజ్ పుత్. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ భామ కూడా త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన మీరా.. అక్క‌డ షాహిద్ కు వ‌చ్చిన అవార్డ్ తాను తీసుకుంది. ఈ ఈవెంట్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోతే హైలైట్ గా నిలిచింది. ఈ షో చూస్తుంటే తానేం హీరోయిన్ల కంటే త‌క్కువ కాద‌నే చెప్పేలా ఉంది. ఇక ఈ మ‌ధ్యే భ‌ర్త‌తో క‌లిసి ఓ ఫోటోషూట్ కూడా చేసింది మీరా. ఇందులో ఒక‌రి కోసం మ‌రొక‌రు అన్నంత‌గా ఇద్ద‌రూ క‌లిసిపోయారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆద‌ర్శ దంపతుల్లా ఉన్నారు షాహిద్ క‌పూర్-మీరా రాజ్ పుత్. బాలీవుడ్ లో బంధాలు చాలా బ‌ల‌హీనంగా ఉంటాయ‌ని.. అందులోనూ అరేంజ్డ్ మ్యారేజెస్ లో అస్స‌లు క‌లిసి ఉండ‌ర‌నే టాక్ ఉంది. కానీ అది అబ‌ద్ధం అని ప్రూవ్ చేస్తున్నారు ఈ జంట‌. వీళ్ల పెళ్లై మూడేళ్లు కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ చిన్న డిఫెరెన్స్ కూడా రాలేదు.. వీళ్ల‌పై ఒక్క గాసిప్ కూడా వినిపించ‌లేదు. రాజ్ పుత్ అంటే నిజంగానే రాణిలా చూసుకుంటున్నాడు షాహిద్. ఇక ఇప్పుడు త‌న భార్య‌ను హీరోయిన్ ల‌కు ధీటుగా చూపిస్తున్నాడు షాహిద్. ఇద్ద‌రు క‌లిసి ఓ ఫోటోషూట్ కూడా చేసారు ఈ మ‌ధ్యే. ఇది చూసిన త‌ర్వాత నేను మాత్రం హీరోయిన్ కంటే ఏం త‌క్కువ అని మీరా.. షాహిద్ ను అడుగుతున్న‌ట్లు ఉంది. ఈమె ఓకే అనాలే కానీ బాలీవుడ్ నుంచి హీరోయిన్ ఆఫ‌ర్లు వ‌చ్చినా వ‌స్తాయి. ఈ జంట ఇలాగే క‌ల‌కాలం ఉండాల‌ని ఆశిద్ధాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here