అక్కా త‌మ్ముడు.. గెలుపు ఎవ‌రిదో..?

VEERI DI WEDDING BHAVESH JOSHI
రాజ‌కీయం అయినా సినిమా అయినా పోటీ లేక‌పోతే మ‌జా రాదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. తాజాగా సొంత అక్కా త‌మ్ముడు బాక్సాఫీస్ వార్ లో దిగుతున్నారు. ఒకేసారి వ‌స్తే ఇద్ద‌రికీ న‌ష్టం అని తెలిసినా కూడా ఇద్ద‌రూ విన‌డం లేదు. అడిగితే వాడిదో సినిమా.. నాదో సినిమా అంటుంది ఆ అక్క‌.
పైగా త‌మ్ముడి సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పింది. కానీ ఇక్క‌డ అంచ‌నాల‌న్నీ అక్క సినిమాపైనే ఉన్నాయి. ఆ అక్క సోన‌మ్ క‌పూర్ అయితే.. త‌మ్ముడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్. ఇద్ద‌రూ అనిల్ క‌పూర్ గారాల‌ప‌ట్టీలే. జూన్ 1న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ న‌టించిన భావేష్ జోషీ.. సోన‌మ్ క‌పూర్ న‌టించిన వీరి ది వెడ్డింగ్ సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. వీటిలో ఒక‌టి ఫుల్ మాస్ అయితే.. మ‌రోటి రొమాంటిక్.
స్టార్ ప‌వ‌ర్ ప‌రంగా చూసుకుంటే సోన‌మ్, క‌రీనా న‌టించిన వీరి ది వెడ్డింగ్ ముందుంది. కానీ భావేష్ జోషిని కూడా తీసేయ‌డానికి లేదు. ఇది ప‌క్కా మాస్ క‌థ‌. పైగా ఈ చిత్రంలో త‌మ్ముడి కోసం ఐటం సాంగ్ కూడా చేసాడు అర్జున్ క‌పూర్. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఈ అక్కా త‌మ్ముడి వార్ గురించే మాట్లాడు కుంటున్నారు. మ‌రి చూడాలిక‌.. ఈ యుద్ధంలో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here