అఖిల్ ఎంత ఫీలై పాడాడో పాపం..

Say HELLO! toAkhil’s Wedding Song

అఖిల్ అక్కినేని.. చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా ఫ్లాప్. కానీ సినిమాల‌కు మించిన ఇమేజ్ ఈ కుర్రాడిది. హీరోగా రాక‌ముందే సిసిఎల్ క్రికెట్ ఈ కుర్రాడిని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఇక అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసాడు. తొలి సినిమాలో డాన్సులు కుమ్మేసాడు. న‌ట‌న‌లో కూడా ప‌ర్లేద‌నిపించాడు. అయితే అఖిల్ లో క‌నిపించ‌ని మ‌రో టాలెంట్ కూడా ఉంది. అదే సింగింగ్. ఆ మ‌ధ్య త‌న స్వ‌రాన్ని విప్పాడు అఖిల్. సైమా అవార్డుల్లో త‌న గానం.. గాత్రంతో అంద‌రికీ షాకిచ్చాడు సిసింద్రీ. విక్ర‌మ్ కే కుమార్ తో తాను చేస్తోన్న హ‌లో సినిమాలోని ఓ పాట‌ను స్వ‌యంగా త‌నే పాడి అక్క‌డి వాళ్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఏదో స‌ర‌దాగా పాడిన‌ట్లుగా కాకుండా ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ రేంజ్ లో పాడేసి కేక పెట్టించాడు అఖిల్. ఇక ఇప్పుడు ఈ పాట‌నే సినిమా ప్ర‌మోష‌న్ కు వాడేసుకుంటున్నాడు నాగార్జున‌. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన స్టూడియో వ‌ర్ష‌న్ విడుద‌ల చేసాడు నాగార్జున‌. విజ‌య్ వ‌ర్ధ‌న్ క‌ట్ చేసిన ఈ పాట‌కు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇక అఖిల్ కూడా ఓ రేంజ్ లో ఫీలై పాడాడు ఈ పాట‌ను. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా హ‌లో సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. మొత్తానికి సిసింద్రీ గాత్రం విన్న త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఊరికే ఎందుకుంటారు..? వ‌ర‌స పెట్టి త‌మ సినిమాల్లో పాడించేయ‌రూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here