అఖిల్ కు 2017 మోస్ట్ స్పెష‌ల్.. 

CCL T10 BLAST - TELUGU WARRIORS Photos
అవును.. చూస్తుంటే ఇప్పుడు అఖిల్ కు అన్నీ క‌లిసొస్తున్న‌ట్లే అనిపిస్తున్నాయి. సినిమా విష‌యం నుంచి క్రికెట్ వ‌ర‌కు అన్నీ సిసింద్రికి అనుకూలంగానే ఉన్నాయిప్పుడు. ఈయ‌న న‌టించిన హ‌లో సినిమా ఈ మ‌ధ్యే విడుద‌లైంది. సినిమా క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నా.. టాక్ మాత్రం చాలా బాగుంది. ఈ చిత్రంతో అఖిల్ హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. తొలి సినిమా అఖిల్ మిగిల్చిన చేదు అనుభ‌వాల్ని ఈ చిత్రం తుడిచేసింద‌నే అనుకుంటున్నాడు అఖిల్. హ‌లోకు టాక్ బాగున్నా వ‌సూళ్లు రావ‌డం లేదు. కానీ దీనిపై ఈ హీరో పెద్ద‌గా చింతిస్తున్న‌ట్లు కూడా లేదు. తాను కోరుకున్న ఇమేజ్ అయితే వ‌చ్చేసింది హ‌లో సినిమాతో. మ‌రోవైపు సిసిఎల్ త‌ర‌ఫున తెలుగు వారియ‌ర్స్ ను వర‌స‌గా మూడోసారి ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు అఖిల్. అక్కినేని వార‌సుడి కెప్టెన్సీలో మ‌రోసారి తెలుగు వారియ‌ర్స్ టీం క‌ప్ గెలిచింది. హైద‌రాబాద్ లోనే జ‌రిగిన సిసిఎల్ టోర్న‌మెంట్ లో ఫైనల్ గెలిచి క‌ప్పు అందుకున్నారు. ఫైన‌ల్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావ‌డం విశేషం. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు క్రికెట్.. అన్నీ 2017ని అఖిల్ కు మోస్ట్ మెమొర‌బుల్ గా మార్చేసాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here