అఖిల్ సినిమాతో రాజ‌మౌళి కనెక్ష‌న్..!


అదేంటి.. అఖిల్ సినిమాతో రాజ‌మౌళికి పనేంటి అనుకుంటున్నారా..? అయినా అఖిల్ చేసిందే రెండు సినిమాలు.. అందులో ఒక‌టి డిజాస్ట‌ర్.. మ‌రో సినిమా ఫ్లాప్.. ఇలాంటి టైమ్ లో ఆయ‌న సినిమా రాజ‌మౌళికి ఏం ప‌ని అని ఆలోచ‌న‌లోనే ఉన్నారా..? ఏం లేదండి.. రాజ‌మౌళి ఇప్పుడు చ‌ర‌ణ్- ఎన్టీఆర్ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్ర క‌థ‌పై ఎన్నో క‌థ‌లు వినిపిస్తున్నాయి.
అస‌లు ఎలా ఉండ‌బోతుందో అనే విష‌యంలో కూడా చిన్న క్లారిటీ ఇవ్వ‌డంలేదు ద‌ర్శ‌క‌ధీరుడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఇది చాలా భిన్న‌మైన క‌థ అని తెలుస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా ఈ చిత్రం సాగుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎలా అంటే హ‌లో సినిమా మాదిరి. ఈ చిత్రం అంతా ఉద‌యం నుంచి సాయంత్రం మ‌ధ్యే న‌డుస్తుంది. ఆ క‌థ‌లోనే కాలం వెన‌క్కి వెళ్లి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి.
అచ్చంగా ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో రాజ‌మౌళి కూడా ట్రై చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ క‌థ కూడా ఉద‌యం నుంచి సాయంత్రం లోపే జ‌రుగు తుంద‌ని తెలుస్తుంది. దీనికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కాకుండా గుణ్నం గంగ‌రాజు క‌థ రాస్తున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. దీనికి రాజ‌మౌళితో పాటు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ త‌మ‌దైన మెరుగులు దిద్దుతున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉండ‌బోతుందో..? 2020లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here