అజ్ఞాతంలోనే ఉన్న ట్రైల‌ర్.. 

‘Agnathavasi’ To Complete Its Final Schedule
అభిమానుల‌ను కంగారు పెట్ట‌డంలో ప‌వ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా..! అదేంటో కానీ ఫ్యాన్స్ గురించి ప‌ట్ట‌న‌ట్లే ఉంటాడు ప‌వ‌ర్ స్టార్. త‌న సినిమాల‌కు సంబంధించి అభిమానులెంత వేచి చూస్తారో తెలిసి కూడా ఈయ‌న అజ్ఞాత‌వాసి విష‌యంలో ఆల‌స్యం చేస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ ను ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేదు. అదేం అంటే ఏమో అంతా ప‌వ‌న్ ఇష్టం అనే స‌మాధానం వ‌స్తుంది. అస‌లు ఆడియో వేడుక‌లోనే ట్రైల‌ర్ విడుద‌ల‌కు ప్లాన్ చేసినా.. త్రివిక్ర‌మ్ అడ్డు ప‌డ్డాడు. ఇక జ‌న‌వ‌రి 1న విడుద‌ల చేద్దాం అనుకుంటే.. ఆల్రెడీ అప్పుడు పాట విడుద‌ల చేస్తున్నారు. దాంతో ట్రైల‌ర్ కోసం ప్ర‌త్యేకంగా ముహూర్తం పెట్టారు. జ‌న‌వ‌రి 5న అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నారు. అప్పుడే ప్రోమో సాంగ్స్ ను కూడా విడుద‌ల చేస్తార‌ని తెలుస్తుంది.
ట్రైల‌ర్ ఆల‌స్యం వెన‌క ప‌వ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్ మాస్ట‌ర్ బ్రెయిన్ కూడా ఉంది. ఇప్పుడు అజ్ఞాత‌వాసికి సంబంధించిన ఏ అప్ డేట్ కానీ.. పాట కానీ.. టీజ‌ర్ కానీ అన్నీ సంచల‌నాలే. క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి. అందుకే ట్రైల‌ర్ ను కాస్త ఆల‌స్యంగా విడుద‌ల చేస్తే.. అజ్ఞాత‌వాసి మ‌రింత ట్రెండింగ్ లో ఉంటుంద‌ని భావిస్తున్నాడు త్రివిక్ర‌మ్. స‌రిగ్గా రిలీజ్ కు ఐదు రోజుల ముందు ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నారు. అంటే ఆ 5 రోజులు అజ్ఞాత‌వాసి గురించి త‌ప్ప మ‌రో చ‌ర్చే ఇండ‌స్ట్రీ మొత్తంలో వినిపించ‌కూడ‌దు. అదే ఈ టీం ప్లాన్. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల‌ కానుంది. మ‌రి చూడాలిక‌.. వీళ్లు చేసిన మాస్టార్ ప్లాన్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here