అజ్ఞాత‌వాసి.. మ‌రో శ్రీ‌మంతుడా..?

 Agnyaathavaasi teaser
అవునా.. అస‌లు ఆ అనుమానం ఇప్పుడు ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు విడుద‌లైన స్టిల్ చూస్తుంటే స‌డ‌న్ గా అంద‌రికీ గుర్తొచ్చేది అదే మ‌రి. సైకిల్ పై కూర్చుని ప‌వ‌న్ ఇచ్చిన పోజు శ్రీ‌మంతుడిని గుర్తు చేసింది. అస‌లే ఈమ‌ధ్య సైకిల్ ఎక్కితే శ్రీ‌మంతుడు అంటున్నారు.
అందుకే ప‌వ‌న్ ఎక్కినా కూడా శ్రీ‌మంతుడే గుర్తుకొచ్చింది. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల తేదీ బ‌య‌టికి వ‌చ్చింది. అది విన్నాక ఆహా ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు ఓ
శుభవార్త వ‌చ్చింది వ‌చ్చింది అనుకుంటున్నారు అభిమానులు. డిసెంబ‌ర్ 16న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత మూడు రోజుల‌కు ఆడియో వేడుక జ‌ర‌గ‌బోతుంది. దీనికి చిరంజీవి ముఖ్యఅతిథిగా వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. ఓ వైపు రాజ‌కీయాలు.. మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్రేక్ ఇస్తూ అజ్ఞాత‌వాసిని ఎటూ కాకుండా చేస్తున్నాడు.
ఇన్నాళ్ల‌కు ఈ చిత్రం టాకీ పూర్త‌యింది. పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటాయి. వాటిని కూడా డిసెంబ‌ర్ లోనే పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్. సినిమాను అనుకున్న‌ట్లుగానే జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయబోతున్నారు. క‌నీసం ప‌ది రోజుల ముందే ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మ‌య్యేలా చూసు కుంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. డిసెంబ‌ర్ 19న ఆడియో విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. కాక‌పోతే ఆడియో ఈవెంట్ కోసం వెన్యూ దొర‌క‌డం లేదు. అదే అస‌లు స‌మ‌స్య‌. ఏదేమైనా ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా పూర్త‌యింది. అదే అభిమానుల‌కు పెద్ద పండ‌గ‌. ఆ త‌ర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి కానీ దేనికి ప‌వ‌న్ ఓటేస్తాడో తెలియ‌డం లేదు. దాంతో నిర్మాత‌లంతా కంగారులో ఉన్నారు. చూడాలిక‌.. ప‌వ‌న్ చూపు ఎటువైపు వెళ్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here