అడివి శేష్ 'గూఢచారి' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Adivi Sesh Goodachari First Look Poster Released
నటుడు – రచయిత అడివి శేష్ కొత్త చిత్రం ‘గూఢచారి’ ఫస్ట్ లుక్ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు విడుదలైనది. క్షణం, ‘అమీ తుమీ’ వంటి విభిన్న చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్ ఈ సారి స్పై థ్రిల్లర్ తో మనముందుకు రానుండటం విశేషం. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. తుపాకులు, బులెట్ లతో అధునాతనంగా డిజైన్ చేయబడిన ‘గూఢచారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ మంచి కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ గూఢచారిగా కనిపిస్తారు. అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీం మిర్చంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శశికిరణ్ తిక్క
కథ: అడివి శేష్
నిర్మాతలు: అభిషేక్ నమ, టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సహా నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సంగీతం: శ్రీచరణ్ పాకాల
మాటలు: అబ్బూరి రవి
ఛాయాగ్రాహకుడు: ష్యానియల్ డియో
ఎడిటర్: గ్యారీ బి.హెచ్.
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here