అదాశ‌ర్మ‌.. కాస్త ఆదా చేయ‌మ్మా..!


పాపం.. కొంద‌రు హీరోయిన్ల‌ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. వాళ్ల‌కు అవ‌కాశాలు లేక‌.. రాక‌.. చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. పైకి మాత్రం ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌టానికి దేనికైనా సై అంటుంటారు. ఇప్పుడు అదాశ‌ర్మ కూడా ఇదే చేస్తుంది. సేల్స్ స‌రిగ్గా లేన‌పుడు.. షాపింగ్ మాల్స్ అన్నీ 50 ప‌ర్సెంట్ ఫ్రీ అని ఆఫ‌ర్ ఇస్తుంటారు. అచ్చంగా అలాగే ఇప్పుడు అదాశ‌ర్మ కూడా అందాల‌ను బేరం పెడుతుంది. ఈ మధ్య కాలంలో అదాశ‌ర్మ‌ అనే ఓ అమ్మాయి ఉంద‌నే విష‌యాన్నే ద‌ర్శ‌క నిర్మాత‌లు బొత్తిగా మ‌రిచిపోయారు. దాంతో త‌న‌ను గుర్తు చేసే ప‌నిలో బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే త‌న అందాల‌తో హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ఫోటోషూట్ల‌తో పిచ్చెక్కిస్తుంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా చిట్టిపొట్టి డ్ర‌స్సులు.. క్లీవేజ్ సోకుల‌తో సెగ‌లు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. కెమెరా క‌నిపిస్తే చాలు అందాలు ప‌రిచేస్తుంది.
ఇన్ని చేస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈమెకు అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. ఏం చేయాలో కూడా తెలియ‌క ఏం చేస్తుందో క్లారిటీ లేక ఏదేదో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. సాయిధ‌రంతేజ్, అల్లుఅర్జున్ లాంటి మెగా హీరోల‌తో న‌టించినా అదా జాత‌కం మార‌లేదు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో చిన్న రోల్ కావ‌డంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లోనూ అంతే. ఇక ఆదితో న‌టించిన గ‌ర‌మ్ ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియ‌దు. ఈ ప‌రిస్థితుల్లో అదా కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ దిమ్మ‌తిరిగిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాలి. కానీ ప‌రిస్థితి చూస్తే చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. అది రావాలంటే అందాలు ఎరేయాలి. దాంతో ఇదిగో ఇలా అందాల ఆర‌బోత‌తో కాలం వెల్ల‌దీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అందాల్ని చూసైనా ఎవ‌రైనా కరుణించ‌క‌పోతారేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here