అదేనువ్వు అదేనేను.. ఓ వ‌రుణ్ తేజ్.. 

Varun Tej
దిల్ రాజు ఇప్పుడు ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఏ సినిమా చేస్తే అది హిట్.. క‌నీసం యావ‌రేజ్. ఫ్లాప్ అనే మాటే లేదు. 2017 లో ఆరు సినిమాలు నిర్మించిన రాజుగారు.. వ‌చ్చే ఏడాదిని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. పెద్ద సినిమాల‌తో పాటు ఈ మ‌ధ్యే ఓ చిన్న సినిమా కూడా అనౌన్స్ చేసాడు దిల్ రాజు. ఆ టైటిల్ అదేనువ్వు అదేనేను. ఒక‌ప్పుడు అభినంద‌న సినిమాలో సూప‌ర్ హిట్ అయిన ఈ పాట‌నే ఇప్పుడు త‌న సినిమాకు టైటిల్ గా మార్చేసాడు రాజు. ఈ చిత్రాన్ని శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తాడ‌ని చెప్పాడు దిల్ రాజు. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ గా అన్ని చెప్తాన‌ని చెప్పిన దిల్ రాజు.. హీరో ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు. అయితే ఇండ‌స్ట్రీలో అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఫిదాతో ఈయ‌న రేంజ్ మార్చేసాడు దిల్ రాజు. అప్పుడే చెప్పాడు త్వ‌ర‌లో వ‌రుణ్ తేజ్ తో మ‌రో సినిమా చేస్తాన‌ని అన్నాడు రాజు. అదే ప్రామిస్ ను ఇప్పుడు అదేనువ్వు అదేనేనుతో పూర్తి చేయ‌బోతున్నాడు. మ‌రి ఈ ప్రేమ క‌థ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here