అనుప‌మ‌ను అదే కాపాడుతుంది..!


ఇండ‌స్ట్రీలో కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు అదృష్టం అలా క‌లిసొస్తుంది అంతే. ఇప్పుడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. ఏడాదిగా ఈమె కెరీర్ ఏమంత బాలేదు. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత చేసిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. కృష్ణార్జున యుద్ధం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా స‌రే ఈ భామ కెరీర్ మాత్రం ముందుకు వెళ్లిపోతుంది. దానికి కార‌ణం ఈమెతో ఒక్క‌సారి న‌టించినా..
సినిమా చేసినా వాళ్లు అలాగే క‌నెక్ట్ అవ్వ‌డం. కావాలంటే చూడండి.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ త‌ర్వాత రామ్ మ‌రోసారి అనుప‌మే కావాలంటూ ఇప్పుడు న‌టిస్తున్న హ‌లో గురూ ప్రేమ‌కోస‌మేలో జోడీ క‌ట్టాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌రంతేజ్ హీరోగా తేజ్ ఐ ల‌వ్ యూలో న‌టిస్తుంది అనుప‌మ‌. ఈ చిత్రం త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.
ఇందులో కూడా అను ప‌మే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఇందుకు కూడా ఓ కార‌ణం ఉంది. కిషోర్ తిరుమ‌ల‌తో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చేసింది అను. ఈ ప‌రిచ‌యంతోనే ఇప్పుడు మ‌రోసారి ఈ భామ వైపు అడుగేస్తున్నాడు కిషోర్. ఇక సాయిధ‌రంతేజ్ కూడా అంతే. తేజ్ త‌ర్వాత మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్నాడు. ఇలా ఈ సెంటిమెంట్ ఇప్పుడు అనుప‌మ కెరీర్ కు అండ‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here