అనుష్కలా పేరు తెచ్చుకోవాలనుకుంటోన్నా – రషీకా దత్

   తెలుగు తెరకు మరో కన్నడ సోయగం రాబోతోంది. పేరు రషీకా దత్. ఈ బ్యూటీ మిస్ రాజస్థాన్ కాంపిటీషన్ లో రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో నీవేనా నను పిలిచినదిఅనే

రొమాంటిక్ హారర్ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ డిప్లమా చేసిన రషీక శనివారం తన బర్త్ డే సందర్భంగా తన కెరీర్ ను తెలుగులోనే మలచుకోవాలనుకుంటున్నానని

చెప్పిందీ భామ.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం..


 

‘‘నేను పుట్టింది పెరిగింది బెంగళూరులో. అక్కడే చదువుకున్నాను. రాజస్తాన్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడే మిస్ రాజస్తాన్ పోటీలో పాల్గొని.. రన్నరప్ గా నిలిచాను. ఆ తర్వాత ముంబైకి

వెళ్లాను. రంగ్ రసియా థియేటర్ ఆర్ట్స్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నా. థియేటర్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడే కొన్ని యాడ్స్ లో ఆఫర్స్ వచ్చాయి. నేను చేసిన యాడ్స్ అన్నీ చాలా గుర్తింపు తెచ్చాయి.

అదే టైమ్ లో హిందీ టివి సీరియల్ లో అవకాశం వచ్చింది. నేను మెయిన్ లీడ్ లో నటించిన ఆ సీరియల్ పేరు ‘ట్విస్ట్ వాలా లవ్’. ఈ సీరియల్ తో పాటు కొన్ని సౌత్ యాడ్స్ లోనూ నన్ను

చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. కథ నచ్చడంతో పాటు ఎప్పటి నుంచో తెలుగులో నటించాలన్న నా కోరిక కూడా నెరవేరుతుందని ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాను. నిజానికి

దీనికంటే ముందే చాలా పెద్ద ప్రాజెక్ట్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఆ టైమ్ లో స్టడీస్ చేస్తున్నాను. అలాగే యాడ్స్ లోనూ బిజీగా ఉన్నాను. దీంతో ఆ ప్రాజెక్ట్ మిస్ అయింది. అయితే ఇకపై పెద్ద

సినిమాల్లోనే నటించాలనుకుంటున్నాను.

నాకు హైదరాబాద్ చిన్నప్పటి నుంచీ తెలుసు. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయిగానే కాదు కానీ.. నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమెలా మంచి

నటి అన్న ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. కథ డిమాండ్ చేస్తే గ్లామరస్ పాత్రలూ ఓకే. నేను తెలుగు పరిశ్రమలోనే సెటిల్ కావాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ఇక్కడే ఉంది.

అందుకే ఓ ట్యూటర్ సాయంతో తెలుగు నేర్చుకుంటున్నాను. ఇక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా తెలుగు సినిమాలు చూశాను. లేటెస్ట్ గా నాని ఎమ్.సి.ఏ చూశాను. నాని నటనకు ఫ్యాన్

అయిపోయా.  అలాగే రానా నేనే రాజు నేనే మంత్రికూడా చూశా. బాగా నచ్చింది. ఓ నటిగా అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా చాలా ఆఫర్స్

వస్తున్నాయి. వీటిలో నాకు నచ్చినవాటినే సెలెక్ట్ చేసుకుంటున్నా.. ప్రస్తుతం ఓ పెద్ద హీరోతో సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన గుడ్ న్యూస్ తో

మీ ముందుకు వస్తాను’’ అని ముగించిందీ ముద్దుగుమ్మ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here