అనుష్క‌కు ఇప్పుడు ప్ర‌భాసే అండ‌..

ANUSHKA PRABHAS BHAGAMATHI PRE RELEASE FUNCTION
టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు.. మీరు అనుకుంటున్న విష‌యంలో కాదు లెండీ.. మ‌రో విష‌యంలో అనుష్క‌కు ప్ర‌భాస్ అండ‌గా ఉంటున్నాడు. ప్ర‌స్తుతం అనుష్క భాగ‌మ‌తి ప్ర‌మోష‌న్ లో ఉంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 26న విడుదల కానుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క‌నుమ‌రుగైపోతున్న ఈ రోజుల్లో ఈమె న‌టించిన ఐదో స్ట్రెయిట్ ఫీమేల్ లీడ్ సినిమా భాగ‌మ‌తి. అరుంధ‌తి.. పంచాక్ష‌రి.. సైజ్ జీరో.. రుద్ర‌మ‌దేవి లాంటి సినిమాల త‌ర్వాత అనుష్క నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. పిల్లా జ‌మీందార్ ఫేమ్ అశోక్ జి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో అనుష్క ఐఏఎస్ ఆఫీస‌ర్ గా న‌టించింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌న‌వ‌రి 21న హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది.
లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అనుష్క జోడీగా ఉన్ని ముకుంద‌న్ ను తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈయ‌న జ‌న‌తా గ్యారేజ్ లో న‌టించాడు. యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను అక్ష‌రాలా 25 కోట్లతో నిర్మించిన‌ట్లు తెలుస్తుంది. అశోక్ కు పిల్ల జ‌మీందార్ త‌ప్ప మ‌రో హిట్ లేదు. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ వేడుక‌కు ప్ర‌భాస్ రానున్నాడు. అనుష్క స్నేహితుడు కావ‌డం.. పైగా యువీ క్రియేష‌న్స్ ప్ర‌భాస్ స్నేహితులదే కావ‌డంతో ద‌గ్గ‌రుండి భాగ‌మ‌తి ప‌నులు చూసుకుంటున్నాడు ఈ హీరో. ప్ర‌భాస్ రాక‌తో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రిన్ని పెర‌గ‌డం ఖాయం. ఆచారి అమెరికా యాత్ర‌తో పోటీ ప‌డుతూ జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here