అప్పుడు చిరు.. ఇప్పుడు నాని..


ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు నోరు అదుపులో ఉండాలి. అది కానీ జారితే లేనిపోని తిప్ప‌లు వ‌స్తుంటాయి. ఈ విష‌యంలో ఈ మ‌ధ్యే చిరంజీవి నోరు జారి అయ్యో అనిపించాడు. రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆది చ‌నిపోతాడ‌ని ట్విస్ట్ ముందే రివీల్ చేసాడు మెగాస్టార్. సినిమా చూసిన ఎగ్జైట్ మెంట్ లో అస‌లు ట్విస్ట్ రివీల్ చేసాడు చిరంజీవి.
ఆ త‌ర్వాత చిత్ర‌యూనిట్ కూడా దీనిపై టెన్ష‌న్ ప‌డ్డారు. ఇక ఇప్పుడు నాని కూడా ఇలాగే నోరు జారాడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇందులో నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న‌.. నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున‌, నాని పాత్ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే దానిపై మాత్రం రోజుకో రకంగా వార్త‌లొచ్చాయి. నాని డాక్ట‌ర్ గా..
నాగార్జున డాన్ గా క‌నిపిస్తార‌ని చెప్పారు. అయితే ఇప్పుడు నాని మాత్రం ఈ క‌థ‌పై నోరు జారాడు. ఇందులో తాను, నాగార్జున అన్నాద‌మ్ములుగా న‌టిస్తున్నామ‌ని చెప్పేసాడు. దాంతో సినిమాలో అస‌లు ట్విస్ట్ బ‌య‌టికి వ‌చ్చేసింది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చాలా ఏళ్ళ త‌ర్వాత అశ్వినీద‌త్ నిర్మిస్తోన్న సినిమా ఇది. మొత్తా నికి నోరు జారి.. క‌థ‌ను కూడా జార‌విడిచేస్తున్నారు మ‌న హీరోలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here