అభిన‌వ సావిత్రికి స‌లాం..!


కీర్తిసురేష్.. నిన్న‌టి వ‌ర‌కు ఈమె కేవ‌లం న‌టి మాత్ర‌మే.. కానీ ఇప్పుడు ఈమె అమ్మ‌.. సావిత్ర‌మ్మ‌. చాలా మంది ఆ త‌రం వాళ్లు ఇప్పుడు ఈమెలో సావిత్రిని చూసుకుంటున్నారు. అంత బాగా ఆ సినిమాలో న‌టించింది ఈ భామ‌. సావిత్రి పాత్ర అన్న‌పుడే కీర్తి భ‌య‌ప‌డింది. కానీ దాన్ని చాలెంజ్ గా తీసుకుని ఆమె పోషించిన విధానం మాత్రం ఇప్పుడు అంద‌ర్నీ మంత్ర‌ముగ్ధుల్ని చేస్తుంది.
అస‌లు మ‌నం చూస్తున్న‌ది కీర్తిసురేష్ నా.. లేదంటే నిజంగానే సావిత్రి గారు ఏమైనా వ‌చ్చారా అనేంత‌గా మాయ చేసింది ఈ భామ‌. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అయితే అచ్చంగా సావిత్రి గారే క‌నిపించారు కానీ కీర్తి కాదు. మాయాబ‌జార్ సీన్ లో సేమ్ టూ సేమ్ సావిత్రిని దించేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఏ న‌మ్మ‌కంతో అయితే నాగీ ఈమెలో సావిత్రిని చూసాడో.. అదే న‌మ్మ‌కాన్ని ఇప్పుడు నిల‌బెట్టింది కీర్తిసురేష్. రాబోయే త‌రాల‌కు మాత్రం కీర్తిసురేషే మ‌హాన‌టి అవుతుంది. సావిత్రి గారంటే కీర్తి పేరు కూడా ఇప్ప‌ట్నుంచీ కీర్తింప‌బ‌డ‌టం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here