అమరావతి లో అతి పెద్ద వీడియో వాల్!

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కి మరో అరుదైన ఘనత. అమరావతి సెక్రటేరియట్ లో ఆసియ లోనే అతిపెద్ద వీడియో వాల్ ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రియల్ టైం గవర్నెన్స్ స్టేట్ సెంటర్ (ఆర్.టి.జి.ఎస్) కార్యక్రమం లో భాగం గా దీనిని అమర్చారు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేయవచ్చు. వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి సంభందిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. రెండో దశ లో ముఖ్యమంత్రి స్వయంగా మానిటర్ చేస్తారు. అధికారులకు, భాదితులకు వీడియో కాల్ చేసి మాట్లాడతారు కూడా. అంతే కాకుండా ఏ అధికారితోనైనా, ఎప్పుడైనా వీడియో కాన్ఫరెన్స్ చేసే వసతి కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here