అమితాబ్ ఎందుకిలా చేస్తున్నాడు..?


అమితాబ్ బ‌చ్చ‌న్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇండియ‌న్ వైడ్ మెగాస్టార్. ఈయ‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఈయ‌నేం చేసినా కూడా ఇండియా మొత్తం ఆస‌క్తిగా చూస్తుంటారు. ఇప్పుడు ఈయ‌న చేస్తోన్న కొన్ని ప‌నులు అభిమానుల‌కు షాక్ ఇస్తున్నాయి.
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే ఈయ‌నపై కోపంగా కూడా ఉన్నారు. అభిమానులు ఎంత‌గానో వేచి చూస్తున్న చిరంజీవి ఫ‌స్ట్ లుక్ ను సింపుల్ గా త‌న ట్విట్ట‌ర్ లో రిలీజ్ చేసాడు పెద్దాయ‌న‌. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
కానీ దాని వెన‌క ఉన్న ప్లాన్ తెలుసుకున్న త‌ర్వాత ఎవ‌రికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సైరా పిక్స్ అమితాబ్ విడుద‌ల చేస్తున్నాడ‌ని యూనిట్ కు తెలియ‌కుండా అయితే ఉండ‌దు క‌దా.. దాని వెన‌క ఓ ప్లాన్ కూడా ఉండే ఉంటుంది క‌దా..! ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. అదేంటో తెలిస్తే ఫ్యాన్స్ కూడా సంతోషంగానే ఫీల్ అవ‌తారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మ‌న‌కు ఎక్కువ‌.. ఇక్క‌డ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తారు. కానీ సైరా అనేది తెలుగు సినిమా మాత్ర‌మే కాదు.. హిందీలోనూ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.
అన్ని ఇండ‌స్ట్రీల‌పై న‌మ్మ‌కంతోనే ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. సినిమాకు ఇప్ప‌ట్నుంచే నేష‌న‌ల్ వైడ్ గా క్రేజ్ అవ‌స‌రం. అప్ప‌ట్లో బాహుబ‌లి కోసం రాజ‌మౌళి కూడా చేసింది ఇదే. త‌న మేకింగ్ వీడియోస్ ను వ‌ర‌స‌గా విడుద‌ల చేసాడు రాజ‌మౌళి. ఇప్పుడు స్టిల్స్ విడుద‌ల చేస్తున్నాడు చిరంజీవి. అది కూడా అమితాబ్ చేతుల మీదుగా.
ఆయ‌న విడుద‌ల చేస్తే ఇండియా మొత్తం ఈ పిక్స్ చూస్తారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్స్ ఉన్న హీరోల్లో అమితాబ్ ముందుంటారు. ఈయ‌న విడుద‌ల చేసిన పిక్స్ కాబ‌ట్టి క‌చ్చితంగా ఇండియ‌న్ వైడ్ గా ట్రెండ్ అవుతాయి. దానివ‌ల్ల తెలుగులో ఇలాంటి సినిమా ఒక‌టి రూపొందుతుంద‌ని.. అందులో అమితాబ్ న‌టిస్తున్నాడ‌ని నేష‌న‌ల్ వైడ్ గా ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. అందుకే పిక్స్ త్వ‌ర‌గానే విడుద‌లైనా కూడా దానివెనక ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా అంతే రేంజ్ లో ఉంది. అది సంగ‌తి.. లేదంటే ఊరికే ఏమీ తెలియ‌కుండానే అమితాబ్ ఈ స్టిల్స్ విడుద‌ల చేయ‌డు క‌దా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here