అమీ.. ఇలా చంపేస్తే ఎలా అమ్మీ..?


బాపురే.. ఒక్క‌సారి ఆ హొయ‌లు చూడండి..! అస‌లే సూర్యుడి వేడికి తాళ‌లేక జ‌నాలు చ‌చ్చిపోతుంటే చూపించి ఊపిరి తీసేస్తుంది అమీజాక్స‌న్. ఈ భామ దూకుడు ముందు మ‌న హీరోయిన్లు సైలెంట్ అయిపోతున్నారు. ఎంతైనా ఇండియ‌న్ భామ‌లు ఎక్క‌డో ఓ చోట బ్రేకులు వేస్తార‌బ్బా..! కానీ ఈ ఫారెన్ భామలే అస‌లెక్కడా బ్రేకులేయ‌రు..
పైగా స్పీడ్ బ్రేక‌ర్ లేని బండిలా దూసుకొస్తారు. ఇప్పుడు అమీజాక్స‌న్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ అమ్మ‌డుది మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో లండ‌న్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ తిష్ట వేసింది అమీజాక్స‌న్. అదృష్టం బాగుండి సూప‌ర్ స్టార్స్ కూడా పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే విక్ర‌మ్, అక్ష‌య్ కుమార్, చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టించింది. ఇప్పుడు ఏకంగా ర‌జినీకాంత్ తో జోడీక‌ట్టింది.
ప్ర‌తీ సినిమాలోనూ అందాల‌తో కుర్రాళ్ల నిద్ర పాడు చేస్తుంది. అమీజాక్స‌న్ కు సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ బాగానే డిమాండ్ ఉంది. 2.0తో పాటు క‌న్న‌డ‌లో సుదీప్ తోనూ ఓ సినిమాలో న‌టిస్తుంది అమీ.
దాంతోపాటు మ‌రో రెండు మూడు సినిమాలు చేస్తుంది. అస‌లు అమీ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. తొలి సినిమా నుంచి అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది ఈ బ్యూటీ. పైగా బ్రిటీష్ బ్రీడ్ కావ‌డంతో అస‌లు గ్లామ‌ర్ షో అంటే పెద్ద‌గా ప‌ట్టింపులే లేవు. తాజాగా అమీ ఓ ఫోటోషూట్ చేసింది. స‌ముద్రం మ‌ధ్య‌లో బికినీతో అమీ చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.
ఇది చూసాక‌ ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు. ప్ర‌తీ ఫోటోలోనూ బికినీతో చంపేసింది అమీ. ఈ అందాల హై టెన్ష‌న్ చూసి అంతా అటెన్షన్ అయిపోతున్నారు. ఈ ఫోటోషూట్ లో కెమెరాతో అందాల అమీ తుమీ తేల్చేసుకుంది. ఈ బ్యూటీ బ్యూటీని చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. మ‌న హీరోయిన్లు ఎంత‌గా రెచ్చిపోయినా.. మ‌రీ ఇంత‌గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here