అమైరా.. ఎన్నాళ్ళ‌కెన్నాళ్ల‌కు బాలీవుడ్ లో..


వ‌చ్చిందే బాలీవుడ్ సినిమాతో.. ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిందే హిందీ సినిమాతో.. కానీ అక్క‌డ జాత‌కం మార‌లేదు.. విజ‌యం ద‌క్క‌లేదు.. దాంతో ద‌క్షిణాది ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది అమైరా ద‌స్తూర్. ఇమ్రాన్ హ‌ష్మీతో మిస్ట‌ర్ ఎక్స్ సినిమాలో రొమాన్స్ పండించింది అమైరా. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు ఎవ‌రూ. ఆ త‌ర్వాత త‌మిళ‌నాట ధ‌నుష్ తో న‌టించిన అనేగ‌న్ హిట్టైనా ఎందుకో కానీ త‌మిళ్ లో కూడా అమైరాకు అవ‌కాశాలు రాలేదు. ఇక తెలుగులో న‌టించిన మ‌న‌సుకు న‌చ్చింది ఇక్క‌డ ఎవ‌రి మ‌న‌సుల‌కు న‌చ్చ‌లేదు. దాంతో అమ్మాయిగారి కెరీర్ ఎటూ కాకుండా పోయింది. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ బాలీవుడ్ నుంచి అనుకోకుండా ఓ పిలుపు వ‌చ్చింది. రాజ్ కుమార్ రావుతో న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈయ‌న అక్క‌డ పెద్ద హీరోయేం కాదు. కానీ మొత్తానికే ఖాళీగా ఉండ‌టం కంటే ఇలా ఒక్క సినిమాలో అయినా న‌టించ‌డం మంచిదే క‌దా..! అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా అవ‌కాశం అంది పుచ్చుకుంది అమైరా ద‌స్తూర్. మ‌రి ఈ చిత్రం ఆమె బాలీవుడ్ కెరీర్ కు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here