అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తప్పేంటి? పవన్ సరే, బాలయ్యను ఏమడగరే?


టీవీ 5 వారు నిర్వహించిన రౌండ్ టేబుల్ డిబేట్ లో పాల్గొన్న కాస్టింగ్ కౌచ్ బాధిత మహిళలు ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ బెంగాలీ అమ్మాయిల తో మస్సాజ్ చేయించుకుంటారని ఓ నటి ఆరోపించగా, రామ్ చరణ్ ముప్పై ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని హీరో అయ్యాడని అన్నారు. మహిళా సంగం అధ్యక్షురాలైన సంధ్య మాట్లాడుతూ అరవై ఏళ్ళ వృద్ధ హీరో అయినా చిరంజీవి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని పాడడం ఏమిటని ఎద్దేవా చేసారు. ఈ విషయం మై మండిపడుతున్నారు మెగా అభిమానులు.
పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తే ప్రచారం వస్తుందనే నెపంతోనే అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని వారు వాపోయారు. ఇదే ప్రశ్నలను నందమూరి బాలకృష్ణ ను అడిగే దమ్ము ఉందా అని అడుగుతున్నారు మెగా అభిమానులు. బాధ్యతాయుతమైన ఎం.ఎల్.ఏ పదవిలో ఉండి ఒకానొక ఫంక్షన్ లో హీరోయిన్లను ముద్దైన పెట్టాలి కడుపైన చేయాలని బాహాటంగా చెప్పిన బాలయ్యను పేరును కూడా తీసే దైర్యం అన్యాయం జరిగిందని గొడవ చేస్తున్న మహిళలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.
అరవైఏళ్లు పైబడిన వృద్దులు రాజకీయ నాయకులుగా మనలను పాలించగా లేనిదీ…సినిమా అని కాల్పనిక ప్రపంచంలో తెరపై వినోదం, ఉత్సాహం పంచడానికి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని డ్యాన్స్ చేస్తే తప్పేంటి అని అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here