అమ్మ‌తో కూడా ప‌వ‌న్ మిస్ అయ్యాడే..!


మెగా ఫ్యామిలీ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉంటాడు. ఆయ‌న‌తో క‌లుపుకుంటేనే మెగా కుటుంబం సంపూర్ణం అవుతుంది. కానీ మెగా ఫ్యామిలీలో జ‌రిగే ఏ ఈవెంట్ కు కూడా ప‌వ‌న్ క‌ళ్యాన్ రాడు. ఆయ‌న‌కు ఉన్న బిజీకి అక్క‌డికి రావ‌డం కూడా క‌ష్ట‌మే. ఇక ఇప్పుడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగా కుటుంబ మంతా క‌లిసి అమ్మ‌ను స‌త్క‌రించుకుంది. చిరంజీవి, నాగ‌బాబుతో పాటు చిరు చెల్లెళ్లు కూడా మెగా మ‌ద‌ర్ అంజ‌నీదేవితో క‌లిసి ఫోటో దిగారు. మ‌ద‌ర్స్ డే రోజు అమ్మ‌కు వంద‌నం చేసారు. కానీ ఇక్క‌డ కూడా ఫ్రేమ్ ఫుల్ కాలేదు. కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌పోవ‌డం. ఈయ‌న ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం జ‌నాల్లోకి వెళ్లిపోయాడు జ‌న‌సేనాని. దాంతో ఇంట్లో కంటే బ‌య‌టే ఎక్కువ‌గా ఉంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. అందుకే మ‌ద‌ర్స్ డే రోజు కూడా అంద‌రూ ఉన్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిస్ అయ్యాడు. లేడు.. కానీ ఉండుంటే బాగుండు అనిపించే ఫోటో ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here