అమ్మ చావుతో అన్న‌కు చేరువైంది..


చావుతో క‌లిసిన బంధం.. ఇక చ‌చ్చిపోయే వ‌ర‌కు విడిపోదేమో. ఇప్పుడు శ్రీ‌దేవి కుటుంబాన్ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఎవ‌రికి వారే యమున‌కు తీరే అన్న‌ట్లుగా ఉన్న వాళ్లంతా ఇప్పుడు ఒక్క‌టైపోయారు. బోనీక‌పూర్ పెద్ద భార్య సంతానం అర్జున్ క‌పూర్, అన్షుల క‌పూర్ ఒక‌వైపు.. శ్రీ‌దేవి కుటుంబం ఒక‌వైపు అన్న‌ట్లుగా ఉండేవి వ్య‌వ‌హారం. మొద‌టి భార్య సంతానంతో బోనీక‌పూర్ కూడా అంటీ ముట్ట‌న‌ట్లు ఉండ‌టంతో శ్రీ‌దేవిపై అర్జున్ క‌పూర్ కు చాలా కోపంగా ఉండేది. కానీ ఆమె మ‌ర‌ణించిన త‌ర్వాత ప‌రిస్థితుల‌న్నీ మారిపోతున్నాయి. చాలా వేగంగా ఎవ‌రికీ అర్థం కాని విధంగా మారిపోతున్నాయి. ఇప్పుడు చెల్లెల్ల‌కు పెద్ద‌దిక్కుగా మారిపోయాడు అర్జున్ కపూర్. అంతేకాదు.. అన్షుల క‌పూర్ కూడా ఇప్పుడు ఝాన్వి, ఖుషీల‌ను అక్కున చేర్చుకుంది.
త‌ల్లి లేని బాధ ఎలా ఉంటుందో ఆరేళ్లుగా వాళ్ల‌కు తెలుసు. అందుకే ఝాన్వి, ఖుషీల‌కు ఇప్పుడు అన్నీ తామే అయ్యారు అర్జున్ అండ్ అన్షుల‌. శ్రీ‌దేవిపై కోపం ఉన్నా కూడా ఇప్పుడు చెల్లెళ్ల‌ను మాత్రం ప్రేమ‌గా చూసుకుంటున్నాడు అర్జున్ క‌పూర్. తాజాగా త‌న కార్ లోనే చెల్లి ఝాన్విని సెట్ కి తీసుకెళ్తున్నాడు అర్జున్ క‌పూర్. ఇక చాలా ఏళ్ళ త‌ర్వాత తండ్రిని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు ఈ హీరో. ఈ మ‌ధ్యే మార్చ్ 6న ఝాన్వి పుట్టిన‌రోజున అన్షుల క‌పూర్ తో పాటు సోన‌మ్ కపూర్ కూడా విషెస్ చెప్పి ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. చూస్తుంటే ఇప్పుడు ఝాన్వీ, ఖుషీల‌కు అన్నీ తానే అయిపోయేలా ఉన్నాడు అర్జున్ క‌పూర్. పోనీలే.. అమ్మ‌ పోతూ పోతూ అన్న‌ను ఇచ్చి వెళ్లింది అనుకుంటున్నారు ఇప్పుడు అర్జున్ ప్రేమ‌ను చూసి బాలీవుడ్ లో. మొత్తానికి శ్రీ‌దేవి చావే ఇన్నాళ్ల‌కు విడిపోయిన కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లిపింద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here