అయ్యో ర‌వితేజ‌.. ఎందుకిలా..?

raviteja
ఇప్పుడు నేల‌టికెట్ సినిమా చూసిన త‌ర్వాత అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ కూడా ఇదే. ఒక‌ప్పుడు మాస్ రాజా సినిమాలంటే ఎంట‌ర్ టైన్మెంట్ క‌థ‌లోనే ఉండేది. ఆయ‌న ప్ర‌త్యేకంగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని కూడా లేదు. క‌థ‌లోనే కావాల్సినంత కామెడీ జ‌న‌రేట్ అయ్యేది. అలా క‌థ అల్లుకునేవాళ్లు ద‌ర్శ‌కులు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒక్క‌డే నాసీర‌కం క‌థ‌లు మోయ‌లేక చ‌చ్చిపోతున్నాడు ర‌వితేజ‌.
తాజాగా నేల‌టికెట్ సినిమా చూస్తే ఈయ‌న క‌ష్ట‌మేంటో అర్థ‌మ‌వుతుంది. తెర‌పై కావాల్సినంత మంది క‌మెడియ‌న్లు ఉన్నా.. కామెడీ చేయ‌డానికి ర‌వితేజ కూడా ఎంతో ట్రై చేస్తున్నా క‌నీసం ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌లేక‌పోతున్నారు. పైగా అన‌వ‌స‌రంగా వ‌చ్చే కామెడీ సీక్వెన్సులు సినిమాపై ఉన్న ఇంప్రెష‌న్ ను కూడా చెడ‌గొట్టే స్తున్నాయి. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ర‌వితేజ‌కు ఇప్పుడు నేల‌టికెట్ కూడా పెద్ద‌గా ఆశ‌లు నిల‌బెట్టేలా అయితే క‌నిపించ‌డం లేదు.
పాత క‌థ‌కు రొటీన్ స్క్రీన్ ప్లే తోడు కావ‌డంతో ర‌వితేజ సినిమాల్లో మ‌రో అత్యుత్త‌మ రొటీన్ చిత్రంగా నేల‌టికెట్ మిగిలిపోయింది. ఈ చిత్రానికి వ‌చ్చిన టాక్ కు క‌నీసం నేల‌టికెట్స్ అయినా ఫుల్ అవుతాయా అనేది ఇప్పుడు అంద‌ర్లోనూ వ‌స్తున్న అనుమానం. మ‌రి చూడాలిక‌.. ఈ టాక్ తో మాస్ రాజా ఈ చిత్రాన్ని ఎంత‌దూరం తీసుకెళ్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here